ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్

హైదరాబాద్: మస్కట్ వేదికగా జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జోరు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను 11-0తో చిత్తుగా ఓడించిన భారత్.. శనివారం తన రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 3-1తో ఘనవిజయం సాధించింది.
భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ (24వ నిమిషంలో), మన్‌దీప్ సింగ్ (31వ ని.లో), దిల్‌ప్రీత్ సింగ్ (42వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. పాకిస్థాన్ తరుపున ఇర్ఫాన్ జూనియర్ మొహమ్మద్ (1వ నిమిషంలో) ఏకైక గోల్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థానే తొలి గోల్ సాధించి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది.

మ్యాచ్ ఆరంభంలోనే పాక్‌కు పెనాల్టీ కార్నర్
మ్యాచ్ ఆరంభంలోనే పాక్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే, గోల్ కీపర్ శ్రీజేష్‌కు తగిలి వచ్చిన బంతిని ఇర్ఫాన్ గోల్‌లోకి పంపి పాక్‌కు 1-0 ఆధిక్యాన్నిచ్చాడు. అయితే, ఏమాత్రం కంగారుపడని భారత్ దాడుల పరంపరను కొనసాగించింది. రెండో క్వార్టర్‌లో టీమిండియా ప్రయత్నాలు సఫలమయ్యాయి.

24వ నిమిషంలో కెప్టెన్ మన్‌ప్రీత్ ఫీల్డ్ గోల్
అయితే, 24వ నిమిషంలో కెప్టెన్ మన్‌ప్రీత్ ఫీల్డ్ గోల్ చేసి 1-1తో స్కోరు సమం చేశాడు. తర్వాత అతనే 33వ నిమిషంలో ఎవ్వరి సాయం లేకుండా ఒక్కడే ప్రత్యర్థి గోల్ పోస్టులోకి దూసుకెళ్లి గోల్ సాధించి భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 42వ నిమిషంలో యువ ఆటగాడు దిల్‌ప్రీత్ చక్కటి గోల్ కొట్టి ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు.

భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ కెరీర్‌కు 200వ మ్యాచ్
తర్వాత పాక్ పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరి క్వార్టర్లో గోల్స్ నమోదు కాలేదు. భారత్ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ మ్యాచ్ ముగించింది. ఈ మ్యాచ్‌తో భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ కెరీర్‌లో 200వ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. పాక్‌పై భారత్‌కిది వరుసగా 11వ విజయం కావడం విశేషం.

ఆదివారం జపాన్‌తో తలపడనున్న భారత్
భారత్ చివరిసారి 2016 దక్షిణాసియా క్రీడల ఫైనల్లో 1-2తో పాక్ చేతిలో ఓడింది. టోర్నీలో భాగంగా భారత్ ఆదివారం తన తర్వాతి మ్యాచ్‌లో జపాన్‌ను ఢీకొంటుంది. భారత్ ఇప్పటికే దాదాపుగా సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. ఆదివారం మ్యాచ్‌ను గెలిచినా, డ్రా చేసుకున్నా.. సెమీస్ బెర్తు అధికారికంగా ఖరారవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications