Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచ కప్ నుంచి ఇంటి ముఖం పట్టిన భారత్

India vs Ireland, Womens Hockey World Cup Highlights: India Lose To Ireland In Tie-Breaker

హైదరాబాద్: హాకీ ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల పోరాటం ముగిసింది. సుదీర్ఘ విరామం సెమీఫైనల్‌ చేరాలనుకున్న భారత కల భగ్నం అయింది. పెనాల్టీ షూటౌట్‌దాకా పోరాడినా ఐర్లాండ్ జట్టును ఓడించలేక మహిళల క్వార్టర్స్‌లోనే భారత్ పరాజయంతో నిష్క్రమించింది. గురువారం అర్థరాత్రి జరిగిన జరిగిన మ్యాచ్‌లో 3-1 గోల్స్‌తో భారత్‌ను ఓడించిన ఐర్లాండ్ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. లీగ్‌దశలో భారత్‌ను ఓడించిన ఉత్సాహంలో ఐర్లాండ్ జట్టు ఆత్మవిశ్వాసంతో క్వార్టర్ ఫైనల్ పోరును ప్రారంభించింది.

ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున ఏకంగా ముగ్గురు క్రీడాకారిణులు వరుసగా విఫలమయ్యారు. లీగ్‌లో ఐర్లాండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం... అలాగే ప్రపంచకప్‌లో 44 ఏళ్ల సెమీస్‌ నిరీక్షణకు తెరదించాలనుకున్న భారత మహిళల జట్టు ఆశలు ఆవిరయ్యాయి. తొలి నిమిషంలోనే దాడులతో ఉద్దేశాన్ని చాటిన ఐర్లాండ్ ప్రయత్నాన్ని భారత డిఫెండర్లు వమ్ము చేశారు. తొలి క్వార్టర్స్‌లో రెండు జట్లూ గోల్ కోసం ముమ్ముర దాడులు చేసినా ఐర్లాండ్ అమ్మాయిలలో దూకుడు కనిపించింది.

రెండో క్వార్టర్‌లో నిక్కి ప్రధాన్ గోల్ చేసే ఊపులో కనిపించిన ఐర్లాండ్ డిఫెండర్లు చురుగ్గా వ్యవహరించడంతో గోల్ చేసే అవకాశం దక్కలేదు. 23వ నిమిషంలో భారత సర్కిల్‌లోకి చేసిన కచ్చితమైన దాడిని భారత గోల్‌కీపర్ సవిత ఎడమవైపు దూకుతూ అద్భుతంగా ఆపింది. ఇలా నాలుగు క్వార్టర్‌లలోనూ పైచేయి సాధించేందుకు రెండు జట్ల ప్లేయర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో నాలుగు క్వార్టర్లు ముగిసినా ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. నిర్ణీత సమయానికి 0-0గా మ్యాచ్‌ ముగిసింది. దీంతో ఫలితం తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది.

ఐర్లాండ్ జట్టు తరఫున తొలి పెనాల్టీ షాట్‌ను సవిత నిలువరించడంతో భారత్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా, భారత్ తరఫున కెప్టెన్ రాణి సహా నవజ్యోత్, మోనికా గోల్స్ ప్రయత్నాలను ఐర్లాండ్ గోల్ కీపర్ మెక్ ఫెర్రాన్ నిలువరించగా..రీనా కోకార్ మాత్రమే గోల్ అందించింది. ఐర్లాండ్ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో మూడు ప్రయత్నాలు విజయవంతం కావడంతో 3-1 స్కోరుతో విజయంతో ప్రపంచకప్ సెమీస్ చేరింది.

Story first published: Friday, August 3, 2018, 11:01 [IST]
Other articles published on Aug 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+