
భువనేశ్వర్: లలిత్ ఉపాధ్యాయ్ రెండుగోల్స్ చేసి భారత్ 5-1తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. సొంతగడ్డపై భారత హాకీ జట్టు అదరగొట్టింది. హోరాహోరీగా జరుగుతున్న పోరులో హాకీ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. పూల్ దశలో జరిగిన చివరి మ్యాచ్‌లో బెల్జియంపై 5-1తో తిరుగులేని విజయం సాధించింది. సగర్వంగా నాకౌట్ దశకు చేరింది.
మొదటి క్వార్టర్స్‌లో భారత్ తొలి గోల్ సాధించగా కెనడా వట్టి చేతుల్తో మిగిలింది. రెండో క్వార్టర్స్‌లో మరో గోల్ సాధించిన భారత్ మూడో క్వార్టర్స్‌లో మరొకటి నాలుగో క్వార్టర్స్‌లో రెండు గోల్స్ చేసి ఐదు గోల్స్ సంపాదించగా కెనడా కేవలం ఒక్కటి మాత్రమే చేయగలిగింది. కీలక పోరులో టీమిండియా ఆటగాళ్లు ఏకంగా 5 గోల్స్ సాధించడం ప్రత్యేకం. ఆరంభం నుంచి మ్యాచ్‌పై హర్మన్‌ప్రీత్ సింగ్ సేనదే ఆధిపత్యం. బంతిని పూర్తిగా తన పరిధిలోనే ఉంచుకుంది.
ఆటగాళ్లు చురుగ్గా కదులుతూ ఒకరికొకరు పాస్‌లు అందించారు. ఎక్కువగా ప్రత్యర్థి కోర్టులోనే ఆడారు. 12వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేశాడు. గోల్ సాధించి భారత్‌ను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. రెండో క్వార్టర్‌లో గోల్స్ నమోదు కాలేదు. 39వ నిమిషంలో వాన్‌సన్ ఫ్లోరిస్ గోల్ చేసి 1-1తో స్కోరు సమం చేశాడు. ఈ క్రమంలో భారత్ విజృంభించి ఆడింది. 6 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ సాధించింది.
చింగల్‌సేన (46 నిమిషంలో), లలిత్ ఉపాధ్యాయ్ (47వ నిమిషంలో) వరుసగా ఫీల్డ్‌గోల్స్ చేశారు. రోహిదాస్ అమిత్ (51వ నిమిషంలో) పెనాల్టీకార్న్‌ను గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత రెండు జట్లు హోరాహోరీగా ఆడాయి. ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా లలిత్ ఉపాధ్యాయ్ (57వ నిమిషంలో) మళ్లీ గోల్ చేసి భారత్‌కు ఘన విజయం అందించాడు. దీంతో టీమిండియా తన ఫూల్‌లో అగ్రస్థానంలో నిలిచి క్రాస్‌ఓవర్ మ్యాచ్‌ను తప్పించుకుంది. పూల్ సీ లోనూ విజయవంతంగా పూర్తి చేసి క్వార్టర్స్ ఫైనల్స్‌లోనూ బెల్జియం ఎఫ్‌ఐహెచ్‌లో మూడో ర్యాంకును దక్కించుకోగలిగింది.