ఆధిక్యతలో దూసుకెళ్లినా..
ఒక దశలో భారత జట్టు 3-2 గోల్స్ తేడాతో ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ప్రత్యర్థి జట్టు గ్రేట్ బ్రిటన్ తనకు దక్కిన అవకాశలను సద్వినియోగం చేసుకుంది. అటాకింగ్ గేమ్‌తో భారత్‌పై పైచేయి సాధించింది. నిర్ణయాత్మకమైన నాలుగో క్వార్టర్‌లో.. ఇంకాస్సేపట్లో మ్యాచ్ ముగుస్తుందనే దశలో గ్రేట్ బ్రిటన్ సాధించిన గోల్.. కోట్లాది మంది భారతీయును తీవ్రంగా నిరాశ పరిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్ 4-3 తేడాతో భారత్‌పై నెగ్గి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

హోరాహోరీగా పోరు
ఈ మ్యాచ్‌లో భారత్-గ్రేట్ బ్రిటన్ మధ్య హోరాహోరీగా పోరు సాగింది. మూడు క్వార్టర్ల వరకూ ఈ రెండు జట్లు కూడా సమవుజ్జీలుగా నిలిచాయి. ఒక దశలో భారత్‌దే పైచేయి. తొలి క్వార్టర్ ఉత్కంఠభరితంగా సాగింది. అటు గ్రేట్ర బ్రిటన్, ఇటు భారత్ ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. రెండో క్వార్టర్ ప్రారంభమైన వెంటనే బ్రిటన్ గోల్ సాధించింది. అదే దూకుడును కొనసాగించింది. రెండో క్వార్టర్‌లోనే గ్రేట్ బ్రిటన్ రెండు గోల్స్ సాధించింది. భారత్‌పై తన ఆధిక్యతను 0-2 గోల్స్‌గా మార్చివేసింది.

అద్భుతంగా భారత్ బౌన్స్ బ్యాక్..
ఆ తరుణంలో భారత్ అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయింది. అదే క్వార్టర్‌లో భారత్ కూడా రెండు గోల్స్ సాధించింది. పాసింగ్, డ్రిబ్లింగ్‌లతో ప్లేయర్లు గేమ్‌ను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆధిక్యతను 3-2తో మరంత ముందుకు తీసుకెళ్లారు. ఆ తరువాత కూడా అదే విజృంభణను కొనసాగించారు భారత విమెన్స్ హాకీ ప్లేయర్లు. ఎక్కడా తొట్రుపాటును ప్రదర్శించలేదు. ఆధిక్యతను చేజార్చనివ్వలేదు. రెండో క్వార్టర్‌లో సమష్టిగా రాణించారు. తొలుత ఆధిక్యతను 2-2గా సమం చేశారు. ఈ రెండు గోల్స్ కూడా గుర్జీత్ కౌర్ సాధించారు.

ఆశలు నీరుగార్చిన మూడో క్వార్టర్..
రెండో క్వార్టర్ ఇక ముగస్తుందనగా వందన కఠారియా మరో గోల్ చేశారు. దీనితో భారత్ 3-2 తేడాతో పైచేయి సాధించింది. అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. 3-2 గోల్స్ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నా చాలు.. పతకం ఖాయమౌతుందని ఆశించారు. ఆ ఆశ ఎంతో సేపు నిలవలేదు. మూడో క్వార్టర్‌లో గ్రేట్ బ్రిటన్ మరో గోల్ సాధించింది. దీనితో ఆధిక్యత 3-3గా నిలిచింది. గోల్ కోసం రెండు జట్లు కూడా పోరాడాయి. ఒకరిపై ఒకరు ఆధిక్యతను సాధించడానికి ఓ పోరాటమే సాగించాయి.

ఒక్క గోల్ తేడాతో..
నాలుగో క్వార్టర్‌లో గ్రేట్ బ్రిటన్‌కు అందిన పెనాల్టీ కార్నర్ లభించింది. భారత ప్లేయర్లు ఫౌల్ చేయడంతో బ్రిటన్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. దీనిని బ్రిటన్ జట్టు సద్వినియోగం చేసుకుంది. తన ఆధిక్యాన్ని 4-3కు పెంచుకుంది. బ్రాడ్సన్ కొట్టిన ఆ షాట్‌ను అడ్డుకోవడంలో గోల్ కీపర్ సవిత పునియా విఫలం అయ్యారు. దాన్ని అడ్డుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేసినప్పటికీ.. అది ఫలించలేదు. బుల్లెట్ వేగంతో దూసుకెళ్లిన ఆ బంతి- నెట్స్‌ను ముద్దాడింది. గ్రేట్ బ్రిటన్‌కు ఆధిక్యతను అప్పగించింది. అప్పటికే మ్యాచ్ దాదాపు ముగింపు దశకు వచ్చేయడంతో భారత్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.


Click it and Unblock the Notifications












