Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ: టైటిల్‌ను పంచుకున్న భారత్-పాక్‌లు

Asian Champions Trophy 2018 finale a

హైదరాబాద్: ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న భారత్-పాక్‌ల ఫైనల్ పోరుకు తెరపడింది. ఉత్కంఠభరితంగా సాగుతుందనుకున్న మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. మస్కట్‌లోని సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2018 ఫైనల్‌ను భారత్-పాక్‌లు భారీ అంచనాలతో మొదలుపెట్టాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్, మాజీ విజేత పాకిస్థాన్‌ జట్ల మధ్య ఆదివారం (అక్టోబరు 28) జరగాల్సిన ఫైనల్‌ మ్యాచ్‌ భారీ వర్షం కారణంగా రద్దుకావడంతో భారత్, పాక్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.

ఉరుములతో కూడిన భారీ వర్షం

ఉరుములతో కూడిన భారీ వర్షం

విజయాన్ని ఇరుదేశాలు పంచుకుని టోర్నీ చరిత్రలో మూడో ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని హాకీ ఇండియా తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆసియా హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్‌ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం (అక్టోబరు 28) రాత్రి 10.40 గం. నుంచి ప్రారంభం కావాల్సింది. అయితే మ్యాచ్‌ మొదలయ్యే సమయానికి ఉరుములతో కూడిన భారీ వర్షం మొదలైంది.

నిర్ణీత సమయానికి ఇరు జట్లు 2-2 గోల్స్‌తో

నిర్ణీత సమయానికి ఇరు జట్లు 2-2 గోల్స్‌తో

వర్షం తగ్గకపోవడం, మైదానంలోకి భారీగా నీరు చేరడంతో.. మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో నిర్వాహకులు ఫైనల్‌ మ్యాచును రద్దు చేసి భారత్, పాకిస్థాన్‌ లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. మన్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని భారత హకీ జట్టు లీగ్‌ దశలో పాకిస్థాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. మరోవైపు జపాన్‌ జట్టు కాంస్యం గెలుచుకుంది. వర్షానికి ముందు జరిగిన పోరులో జపాన్‌ షూటాఫ్‌లో భారత్ 3-2తో మలేసియాపై విజయం సాధించింది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 2-2 గోల్స్‌తో సమంగా నిలవడంతో ఆట షూటాఫ్‌కు దారితీసింది.

లీగ్‌ దశలో పాక్‌పై గెలిచిన భారత్

లీగ్‌ దశలో పాక్‌పై గెలిచిన భారత్

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు ముందు ఈ ఏడాది పాకిస్థాన్‌తో నాలుగు మ్యాచ్‌ల్లో పోటీపడ్డ భారత పురుషుల జట్టు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో 2-2తో డ్రా చేసుకున్న భారత్‌.. ఆ తర్వాత హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో 4-0తో, ఆసియా క్రీడల్లో 2-1తో గెలిచింది. ప్రస్తుతం ఆసియా హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ లీగ్‌ దశలో పాక్‌పై గెలిచింది.

2016లో టోర్నీలో భారత్‌ విజేతగా

2016లో టోర్నీలో భారత్‌ విజేతగా

2011 నుంచి ప్రారంభమైన హాకీ ఛాంపియన్స్‌ తొలి టోర్నీని భారత జట్టు కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2012, 2013లో జరిగిన టోర్నీల్లో పాకిస్థాన్‌ వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ టోర్నీ నిర్వహించలేదు. దీంతో మూడేళ్ల విరామం తర్వాత 2016లో నిర్వహించిన టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచింది.

Story first published: Monday, October 29, 2018, 10:58 [IST]
Other articles published on Oct 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+