
హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. ఫైనల్ చేరేందుకు కనీసం 'డ్రా' చేసుకుంటే సరిపోయే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచేందుకు చోమటోడ్చింది. చివరకు మ్యాచ్ డ్రాగా ముగియడంతో తుదిపోరుకు అర్హత సంపాదించింది.
ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున మన్‌దీప్ సింగ్ (47వ నిమిషంలో) టీమిండియాకు గోల్ అందించాడు. ఆ తర్వాత థియరీ బ్రింక్‌మన్ (55వ నిమిషంలో) నెదర్లాండ్స్ తరఫున ఏకైక గోల్ చేశాడు. ఆరంభంలోనే వచ్చిన అవకాశాన్ని ఎస్‌వీ సునీల్ వృథా చేసినా నెదర్లాండ్స్ డిఫెన్స్‌పై ఒత్తిడిని పెంచడంలో సఫలమైంది.
తొలి క్వార్టర్‌లోనే భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించాయి. మూడో నిమిషంలో హర్మన్‌ప్రీత్ కొట్టిన బలమైన హై ఫ్లిక్‌ను డచ్ గోల్‌కీపర్ సమర్థంగా అడ్డుకున్నాడు. 13వ నిమిషంలో వచ్చిన రెండో పెనాల్టీని కూడా భారత్ వృథా చేసుకుంది. ఆ తర్వాత రెండో క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్స్ కోసం హోరాహోరీగా పోరాడాయి.
ఈ సమయంలో 25వ నిమిషంలో నెదర్లాండ్స్‌కు వెంటవెంటనే పెనాల్టీలు లభించాయి. ఈ రెండు పెనాల్టీ కార్నర్లను అతను సమర్థంగా అడ్డుకున్నాడు. ఇందులో ఏ ఒక్కటి గోల్ అయినా భారత్ పరిస్థితి క్లిష్టంగా ఉండేది. రెండు జట్లు హోరాహోరీ ఆడడంతో మూడు క్వార్టర్లలో గోల్స్ నమోదు కాలేదు.
రెండో అర్ధభాగంలో భారత్ చక్కని అవకాశాలను సృష్టించుకుంది. 47వ నిమిషంలో మన్‌దీప్‌సింగ్ గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. కొద్దిసేపటికే నెదర్లాండ్స్ పెనాల్టీని సాధించింది. దీనిని బ్రింక్‌మన్ గోల్‌గా మలిచి స్కోరు సమం చేశాడు. తర్వాత డచ్ ఆటగాళ్లు చేసిన ఎదురుదాడిని భారత డిఫెన్స్ సమర్థంగా తిప్పికొట్టింది.
ఆరు దేశాలు తలపడుతున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలువగా, భారత్ రెండో స్థానంలో ఉంది. టోర్నీ నిబంధనల ప్రకారం టాప్-2 జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. టైటిల్ కోసం ఆదివారం భారత్.. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది.
రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్1లో ప్రత్యక్ష ప్రసారం