
హైదరాబాద్: చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు సత్తా చాటింది. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. నెదర్లాండ్స్‌లోని బ్రెడా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు 4-0 గోల్స్ తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది.
వరుస విరామాల్లో గోల్స్ మీద గోల్స్ చేస్తూ ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. ప్రపంచంలోని ఆరు అగ్రశ్రేణి జట్లు బరిలోకి దిగిన ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్-భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది.
ర్యాంకింగ్స్ పరంగా చూసుకుంటే పాకిస్తాన్ (13) కంటే మెరుగ్గా ఉన్న భారత్ (6) ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకుంది. మ్యాచ్ ఆరంభానికి ముందు హాకీ ప్రధాన కోచ్ హరేంద్ర సింగ్ చెప్పినట్లే ఎలాంటి భావోద్వేగాలకు తావివ్వకుండా భారత్ మెరుగైన ఆటతీరుతో చాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం చేసింది.