For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన భారత్

Junior Hockey World Cup 2025: భారత జూనియర్ మెన్స్ హాకీ జట్టు ఊహించని విధంగా పుంజుకుని చరిత్ర సృష్టించింది. టైటిల్ గెలవాలనే లక్ష్యం నెరవేర్చుకోలేకపోయిన భారత్.. కాంస్యం పతక పోరులో విజేతగా నిలిచింది. అర్జెంటీనాను 4-2 తేడాతో ఓడించి జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో మొట్టమొదటిసారిగా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 0-2తో వెనుకబడిన స్థితి నుంచి జట్టు చివరి క్వార్టర్‌లో అద్భుతంగా పుంజుకుని 4 గోల్స్ చేసి చరిత్ర సృష్టించింది.

మరోవైపు సెమీస్‌లో భారత్‌ను ఓడించిన డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ ఫైనల్లో గెలిచి టైటిల్ గెలుచుకుంది. స్పెయిన్ పై జరిగిన ఫైనల్లో జర్మనీ జయకేతనం ఎగురవేసింది. ఆ జట్టు రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి 1-1తో సమమైంది. ఈ క్రమంలో జర్మనీ షూటౌట్‌లో 3-2 తేడాతో స్పెయిన్‌ను ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇక కాంస్య పోరులో భారత్ విజేతగా నిలవడం మాత్రం అద్భుతమే. 0-2తో వెనుకబడిన స్థితి నుంచి జట్టు చివరి క్వార్టర్‌లో పుంజుకుని గెలవడం అనేది నిజంగా విశేషమే.

India Creates History with First-Ever Bronze at Junior Hockey World Cup 2025

ముందుగా 0-2 తేడాతో వెనుకబడిన భారత్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. మూడో నిమిషంలోనే నికోలస్ రోడ్రిగ్జ్ గోల్ తో అర్జెంటీనా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడవ క్వార్టర్ చివర్లో శాంటియాగో ఫెర్నాండెజ్ చేసిన గోల్‌తో అర్జెంటీనా తమ ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. దీంతో భారత్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. కానీ నాలుగో క్వార్టర్‌లో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. చివర్లో భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. 10 నిమిషాల వ్యవధిలోనే 4 గోల్స్ కొట్టి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.

*1-2: మరో 11 నిమిషాలు మిగిలి ఉండగా అంకిత్ పాల్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోరును 1-2కి తగ్గించి, మ్యాచ్‌లో ఉత్సాహాన్ని నింపాడు.

*2-2: కొద్దిసేపటికే భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించింది. మన్‌మీత్ సింగ్ అద్భుతమైన డిఫ్లెక్షన్‌తో తొమ్మిది నిమిషాలు మిగిలి ఉండగా స్కోరును 2-2తో సమం చేశాడు.

మ్యాచ్ గమనం పూర్తిగా మారిపోయింది. భారత్ కృషి ఫలించి వారికి పెనాల్టీ స్ట్రోక్ లభించింది. శారదా నంద్ తివారీ మూడు నిమిషాలు మిగిలి ఉండగా దానిని గోల్ చేసి భారత్‌ను 3-2తో ఆధిక్యంలోకి తెచ్చాడు.చివరి క్షణాల్లో అర్జెంటీనా ఆటగాళ్లు గోల్‌కీపర్‌ను తొలగించి ఆడటం మొదలుపెట్టగా, భారత్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఇక్కా సింగ్ మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి 4-2తో అద్భుతమైన విజయాన్ని ఖాయం చేశాడు.

తొలిసారి పతకం
ఫైనల్ విజిల్ మోగగానే భారత హాకీకి అది ఒక చిరస్మరణీయమైన రాత్రిగా నిలిచింది. చివరి క్వార్టర్‌లో నాలుగు గోల్స్ చేసిన భారత జట్టు జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో దేశానికి తొలి కాంస్య పతకాన్ని అందించింది. దేశీయ అభిమానులను ఆనందంతో ముంచెత్తింది.

Story first published: Thursday, December 11, 2025, 6:25 [IST]
Other articles published on Dec 11, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+