Chack De: నరాలు తెగే ఉత్కంఠత: మహిళా హాకీ జట్టు పోరాటం.. అపూర్వం: చివరి వరకూ

టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021 తొమ్మిదో రోజు భారత్ తన పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. కొన్ని కీలక ఈవెంట్లలో చేదు అనుభవాలను ఎదుర్కొన్నప్పటికీ..మిగిలిన ఈవెంట్లలో అంచనాలకు మించి రాణిస్తోంది. మహిళల డిస్కస్ థ్రోలో భారత్ ఫైనల్స్‌కు చేరడం బహుశా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ఈ ఈవెంట్‌లో భారత్ ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. స్టార్ అథ్లెట్ కమల్‌ప్రీత్ కౌర్.. ఈ కేటగిరీలో అద్భుతంగా రాణించారు. డిస్కస్‌ను 64 మీటర్ల దూరం వరకు విసిరారు. టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచారు. ఫైనల్స్‌కు అర్హత సాధించారు.

స్ఫూర్తిదాయక విజయం..
అదే సమయంలో మహిళల హాకీ విభాగంలో భారత్ స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుంది. గ్రూప్ దశలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను మట్టి కరిపించిన భారత మహిళా జట్టు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇవ్వాళ దక్షిణాఫ్రికాను ఓడించింది. ఆ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. చివరి వరకూ పోరాటాన్ని సాగించింది. ప్రతి క్వార్టర్ కూడా నరాలు తెగే ఉత్కంఠతకు గురి చేసింది. చివరి క్వార్టర్‌లో సాధించిన గోల్‌తో విజయం తలుపు తట్టింది భారత జట్టు.. తన క్వార్టర్ ఫైనల్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

అన్నింట్లోనూ సమవుజ్జీగా..
టోక్యో ఓఐ హాకీ స్టేడియం సౌత్ పిచ్‌పై సాగిన ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు నెలకొంది. తొలి క్వార్టర్‌లో భారత జట్టు గోల్ సాధించింది. అటాకర్ వందన కఠారియా తొలి గోల్ సాధించారు. దీనితో 1-0 తేడాతో ముందంజ వేసింది. ఫస్ట్ క్వార్టర్స్‌లో 52 శాతం వరకు బంతిని తన ఆధీనంలో ఉంచుకోగలిగింది హాకీ ఇండియా విమెన్స్ టీమ్. ఐర్లాండ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్ తరహాలోనే పట్టును బిగించింది. ఇంకాస్సేపట్లో ఫస్ట్ క్వార్టర్ ముగుస్తుందనగా.. దక్షిణాఫ్రికా గోల్ సాధించింది. 1-1తో సమవుజ్జీగా నిలిచింది.

అవకాశాలొచ్చినా..
ఆ వెంటనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను భారత్ గోల్‌గా మలచలేకపోయింది. రెండో క్వార్టర్‌లో కూడా భారత్ తన దూకుడును కొనసాగించింది. వందన కఠారియా మరోసారి గోల్ సాధించారు. ఆమె కొట్టిన షాట్‌ను కీపర్ లుఫుమ్లో ఎంబండే అడ్డుకోలేకపోయారు. దీనితో 2-1 తేడాతో భారత్ మళ్లీ ఆధిక్యాన్ని సాధించింది. ఆ తరువాత భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ.. సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి క్వార్టర్‌ను రిఫ్లెక్ట్ చేస్తూ రెండో క్వార్టర్ ముగింపు దశలో దక్షిణాఫ్రికా గోల్ చేసింది. ఫలితంగా- 2-2 ఆధిక్యతతో నిలిచాయి రెండు జట్లూ.

ప్రతి పోరులోనూ హోరాహోరీ..
మూడో క్వార్టర్ మొదట్లోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను భారత్ గోల్‌గా మలిచింది. పెనాల్టీ కార్నర్‌ను నేహా గోల్‌గా మలిచారు. దీనితో భారత్ ఆధిక్యత మళ్లీ 3-2గా మారింది. దీనితో దక్షిణాఫ్రికా ఒత్తిడిలోకి వెళ్లింది. ఈ దశలో దక్షిణాఫ్రికా మళ్లీ గోల్ కొట్టింది. స్టార్ ప్లేయర్ మ్యారిజెన్ గోల్ చేశారు. ఆధిక్యత మళ్లీ సమమైంది. 3-3గా నిలిచింది. నాలుగో క్వార్టర్‌లో భారత్ మళ్లీ గోల్ చేసింది. ఈ సారి కూడా వందన కఠారియా గోల్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఆమె మూడు గోల్స కొట్టారు. ఇంకో తొమ్మిది నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా వందన కఠారియా గోల్ చేయడంతో ఇక దక్షిణాఫ్రికా తేరుకోలేకపోయింది. భారత్ గోల్ పోస్ట్‌పై పదేపదే దాడులు చేసినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. 4-3 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. తన క్వార్టర్ ఫైనల్స్ ఆశలను సజీవంగా నిలుపుకొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications