న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుమ్మురేపిన మన అమ్మాయిలు: ఆసియా కప్ ఫైనల్లో చైనా చిత్తు, విజేత భారత్

ఆసియా కప్ హాకీ ఫైనల్లో మన అమ్మాయిలు అదరగొట్టారు. పెనాల్టీ షూటౌట్‌లో ప్రత్యర్థి చైనా జట్టును 5-4 గోల్స్ తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది.

కకామిగహర: ఆసియా కప్ హాకీ ఫైనల్లో మన అమ్మాయిలు అదరగొట్టారు. పెనాల్టీ షూటౌట్‌లో ప్రత్యర్థి చైనా జట్టును 5-4 గోల్స్ తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది.

తిరుగులేని ప్రదర్శనతో ఆసియా కప్‌ కైవసం చేసుకొని రికార్డు సృష్టించారు. నవ్‌జ్యోత్‌ కౌర్‌ (25వ ని) గోల్‌ చేయడంతో తొలుత టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

asia cup

అనంతరం తియాన్‌తియాన్‌ లువో (47వ ని)లో గోల్‌ కొట్టడంతో చైనా 1-1తో స్కోర్‌ సమం అయింది. మ్యాచ్‌ ముగిసేసరికి మరో గోల్‌ నమోదు కాకపోవడంతో షూటౌట్‌ అనివార్యమైంది.

ఉత్కంకరంగా సాగిన షూటౌట్‌ రెండు జట్లు 4-4తో నిలిచాయి. చివరి అవకాశంలో కెప్టెన్‌ రాణి గోల్‌ కొట్టింది. ఆ తర్వాత చైనా విఫలం కావడంతో భారత్‌ 5-4తో చైనాకు షాకిచ్చింది. గ్రూప్‌ దశలోనూ చైనాను టీమిండియా ఓడించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:16 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X