Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్!

IND vs PAK: మస్కట్ వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన ఎఫ్ఐహెచ్ యూత్ హాకీ ఫైవ్స్ ఆసియా ఛాంపియన్‌షిప్ ఫైనల్ పోటీల్లో భారత సబ్-జూనియర్ పురుషుల జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 3-1 తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. రోమిత్ పాల్(5వ నిమిషం), కెప్టెన్ కేతన్ కుష్వాహా(12వ నిమిషం), షారుఖ్ అలీ(13వ నిమిషం) చేసిన 3 గోల్స్‌తో భారత్ ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో భారత పురుషుల జట్టు ఎలైట్ పూల్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

IND vs ZIM: అభిషేక్ ఔట్.. సిక్సర్ల వీరుడు ఇన్! మూడో టీ20లో ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs ZIM: అభిషేక్ ఔట్.. సిక్సర్ల వీరుడు ఇన్! మూడో టీ20లో ఆడే భారత తుది జట్టు ఇదే!

ఫైనల్లో సత్తా చాటిన భారత్
ఖచ్చితమైన పాస్‌లు, క్రమశిక్షణతో కూడిన వ్యూహాల పుణ్యమా అని ఫైనల్‌లో భారత్ ఆరంభంలోనే ఆధిక్యం సాధించింది. తొలి అర్ధభాగంలో పాకిస్థాన్ గోల్ కీపర్‌ను ఓడించి రోమిత్ పాల్ తొలి గోల్ చేయడంతో విరామ సమయానికి భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగం ఆరంభంలోనే కెప్టెన్ కేతన్ కుష్వాహా (12వ నిమిషం) గోల్ చేసి భారత్‌ను పటిష్టమైన స్థితిలో నిలబెట్టాడు. ఆ వెంటనే షారుఖ్ అలీ మరో గోల్ చేసి స్కోరును 3-0కి చేర్చాడు. మహమ్మద్ ఉస్మాన్ (16వ నిమిషం) ద్వారా పాకిస్థాన్ ఆధిక్యాన్ని తగ్గించినప్పటికీ.. చివరి నిమిషాల్లో భారత డిఫెన్స్ విభాగం పటిష్టంగా నిలబడి మరిన్ని గోల్స్ జరగకుండా అడ్డుకుంది.

IND vs PAK India Beats Pakistan 3-1 to Win FIH Youth Hockey 5s Asia Championship Title

ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన హాకీ ఫైవ్స్
ఫైనల్‌కు చేరడం ద్వారా భారత్, పాకిస్తాన్ దేశాలు రెండూ తొలి ఎఫ్ఐహెచ్ యూత్ హాకీ ఫైవ్స్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి. మహిళల పోటీలో చైనాతో హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో 2-4 తేడాతో ఓడిపోయిన తర్వాత భారత సబ్-జూనియర్ మహిళా జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది.

ధోనీలా చేయబోయి.. ఈజీ రనౌట్ మిస్ చేసిన ఇషాన్ కిషన్!(వీడియో)

ధోనీలా చేయబోయి.. ఈజీ రనౌట్ మిస్ చేసిన ఇషాన్ కిషన్!(వీడియో)

భారత ఆటగాళ్లకు అవార్డులు
స్వర్ణ పతకం గెలుచుకున్న భారత పురుషుల జట్టులోని ప్రతి క్రీడాకారునికి రూ. 2 లక్షలు, ప్రతి సహాయక సిబ్బందికి రూ. 1 లక్ష చొప్పున, అలాగే రజత పతకం గెలుచుకున్న భారత మహిళల జట్టులోని ప్రతి క్రీడాకారిణికి రూ. 1 లక్ష, ప్రతి సహాయక సిబ్బందికి రూ. 50,000 చొప్పున రివార్డులను హాకీ ఇండియా ప్రకటించింది.

Story first published: Sunday, July 26, 2026, 11:59 [IST]
Other articles published on Jul 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+