న్యూఢిల్లీ: భారత హాకీ కోచ్ పాల్ వాన్ యాస్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఇతను ఆరు నెలలు మాత్రమే ఈ పదవిలో ఉన్నాడు. ఇతను నెదర్లాండ్ దేశస్తుడు. తొలగింపుకు కారణాలను హాకీ ఇండియా తెలపలేదు. అయితే హాకీ వరల్డ్ లీగ్‌లో భారత జట్టు ఆట తీరుపై సకాలంలో నివేదిక సమర్పించక పోవడం వల్లే అతన్ని తొలగించారనే వార్తలు వస్తున్నాయి.
కాగా, ఫెడరేషన్ అధ్యక్షుడు నరీందర్ బత్రాతో గొడవ కారణంగానే తనను తొలగించినట్లు కోచ్ పాల్ వాన్ యాస్ తెలిపారు. 'నేను జనవరి 13నే చెప్పాను. డాక్టర్ బత్రా నన్ను కోచ్ పదవిలో ఉంచడానికి ఇష్టపడటం లేదు' అని చెప్పారు.
అధికారికంగా తన తొలగింపు పూర్తయిందని, ఈ వారం చివరి వరకు బాధ్యతల నుంచి తొలగించడం జరుగుతుందని తెలిపారు. తన తొలగింపునకు కారణమేమి లేదని, ఇప్పుడు కారణం వెతుక్కుంటున్నారని చెప్పారు.

తన ముందు ఆటగాళ్లను తిడితే తాను ఊరుకోలేదని, అందుకే అధ్యక్షుడితో వాగ్వాదానికి దిగానని చెప్పారు. ఈ కారణంతోనే తనను కోచ్ పదవి నుంచి తప్పిస్తున్నారని పాల్ వాన్ తెలిపారు.
భారత్‌ను గెలిపించిన యుకీ బాంబ్రీ
న్యూజిలాండ్‌తో డేవిస్‌కప్ కీలకమ్యాచ్‌లో ఢిల్లీ కుర్రాడు యుకీ బాంబ్రీ విజయం సాధించడంతో వరల్డ్ గ్రూప్ ప్లేఆఫ్‌లో భారత్‌కు చోటు దక్కింది. ఆదివారం కివీస్‌తో జరిగిన రివర్స్ సింగిల్స్ పోరులో సోమ్‌దేవ్, యుకీ తమ మ్యాచ్‌లను గెలుపొంది భారత్‌కు 3-2 ఆధిక్యాన్ని అందించారు. ఫలితంగా భారత్ తిరిగి వరల్డ్‌గ్రూప్‌కు అర్హత సాధించింది.
కివీస్‌తో చివరిదాకా ఉత్కంఠగా సాగిన ఈ పోరులో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది యుకీనే. తొలిరోజు తొలి సింగిల్స్‌లో యుకీ నెగ్గినా, రెండో సింగిల్స్‌లో సోమ్‌దేవ్ ఓడడంతో 1-1తో స్కోరు సమమైంది.
ఇక శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో ప్రపంచ టాప్ ఆటగాడు రోహన్ బోపన్న జోడీ సులువుగా గెలుస్తుందనుకుంటే అనూహ్యంగా ఓటమి ఎదురవడంతో, భారత్ ఆశలన్నీ రివర్స్ సింగిల్స్‌పైనే నిలిచాయి. దీంతో 1-2తో వెనకబడి ఆదివారం రివర్స్ సింగిల్స్ బరిలో దిగిన భారత్‌కు తొలి సింగిల్స్‌లో సోమ్‌దేవ్ గెలిచి జట్టు ఆశలను సజీవం చేశాడు.
సోమ్‌దేవ్ 6-4, 6-4, 6-4తో కివీస్ ఆటగాడు మార్కస్ డానియెల్‌ను వరుససెట్లలో ఓడించడంతో ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. దీంతో కచ్చితంగా నెగ్గాల్సిన కీలకమ్యాచ్‌లో యుకీ 6-2, 6-2, 6-3తో మైకేల్ వీనస్‌ను చిత్తుచేయడంతో భారత్ విజయం ఖరారైంది. ఈ విజయంతో భారత్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే వరల్డ్ గ్రూప్ ప్లేఆఫ్‌లో ఆడనుంది.