న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హకీ వరల్డ్‌కప్: క్వార్టర్స్‌కు ఆస్ట్రేలియా, చైనాపై 11-0తో భారీ విజయం

Hockey World Cup 2018, India vs Canada : India Seek Win To Top League Table | Oneindia Telugu
HWC 2018: Australia hammer China 11-0; England edge Ireland 4-2 in Pool B encounter

హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరిగిన హాకీ వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. పూల్‌-బిలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 11-0తో చైనాను చిత్తుగా ఓడించింది.

ఆసీస్ తరుపున హ్యాట్రిక్ గోల్స్‌ నమోదు చేసిన గోవర్స్

ఆసీస్ తరుపున హ్యాట్రిక్ గోల్స్‌ నమోదు చేసిన గోవర్స్

ఆస్ట్రేలియా తరుపున బ్లేక్ గోవర్స్(10ని, 19ని, 34ని) హ్యాట్రిక్ గోల్స్‌ నమోదు చేయగా.. టిమ్‌ బ్రాండ్‌ (33వ, 55వ) రెండు గోల్స్‌ చేశాడు. ఆరన్‌ జెలెస్కీ (15వ), టామ్‌ క్రెయిగ్‌ (16వ), జెర్మీ హేవర్డ్‌ (22వ), జేక్‌ వెటన్‌ (29వ), డైలన్‌ వొథర్స్‌స్పూర్‌ (38వ), ఫిన్‌ ఓగ్లివి (49వ) తలా ఒక గోల్‌ నమోదు చేశారు.

 ఆస్ట్రేలియా గోల్స్ వర్షం

ఆస్ట్రేలియా గోల్స్ వర్షం

ఈ మ్యాచ్‌‌లో ఆస్ట్రేలియా గోల్స్ వర్షం కురిపించింది. అంతర్జాతీయ హాకీలో అంతగా అనుభవం లేని చైనాపై డిఫెండింగ్ ఛాంపియన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్ పదో నిమిషంలో బ్లేక్ గోవర్స్ పెనాల్టీ కార్నర్‌తో మొదలైన గోల్స్ పరంపర ఆఖరి వరకు కొనసాగింది.

 చైనాను ఓ ఆటాడుకున్న ఆస్ట్రేలియా

చైనాను ఓ ఆటాడుకున్న ఆస్ట్రేలియా

కళ్లు చెదిరే ఆటతీరుతో అరంగేట్రం టీమ్ చైనాను ఓ ఆటాడుకున్న ఆస్ట్రేలియా ఏ దశలోనూ ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశమ్విలేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టు ఫార్వర్డ్ దెబ్బకు చైనా డిఫెన్స్ కకావికలైంది. తాజా విజయంతో మొత్తం తొమ్మిది పాయింట్లను ఆస్ట్రేలియా తన ఖాతాలో వేసుకుంది.

మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4-2తో ఐర్లాండ్‌పై విజయం

అంతేకాదు గ్రూప్‌ టాపర్‌గా నిలిచిన ఆస్ట్రేలియా నేరుగా క్వార్టర్స్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4-2తో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టులో డేవిడ్ (15ని), లియామ్(37ని), జేమ్స్ (38ని) గోల్స్ చేశారు. ఇంగ్లాండ్‌ (4 పాయింట్లు), చైనా (2 పాయింట్లు) క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌లకు అర్హత సాధించాయి.

Story first published: Saturday, December 8, 2018, 10:36 [IST]
Other articles published on Dec 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X