Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హాకీ:హోరాహోరీ పోరులో భార‌త్‌దే పైచేయి

Hockey World League Final: India beat Belgium in thrilling shootout to enter semi-final

హైద‌రాబాద్‌: పూల్‌-బిలో భారత జట్టు ఒక డ్రా, రెండు ఓటములతో ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే, ఈ మ్యాచ్ గెల‌వ‌క‌పోతే ఇంటికి వెళ్లిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ సంద‌ర్భంలో భార‌త్ ఏ మాత్రం ప‌ట్టు విడ‌వ‌లేదు. మొద‌టి రెండు క్వార్ట‌ర్స్ గ‌ట్టి పోటినిచ్చింది. చివ‌రి దశ‌లో త‌నే పైచేయి సాధించింది.

ఇప్ప‌టికి వ‌ర‌కు అజేయంగా దూసుకుపోతున్న బెల్జియంకు జ‌ట్టుకు భార‌త్‌తో ఫైన‌ల్ మ్యాచ్ ప‌డింది. ఈ త‌రుణంలో బుధవారం భారత హాకీ అభిమానులకు మన్‌ప్రీత్‌ సేన నమ్మశక్యం కాని విజయాన్ని అందించింది. రసవత్తరంగా సాగిన క్వార్టర్స్‌లో ప్రపంచ నం.3 బెల్జియంతో నిర్ణీత సమయంలో మ్యాచ్‌ 3-3తో టై కాగా.. షూటౌట్‌లో భారత్‌ 3-2తో రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేతను ఓడించింది.

ఈ మధ్య కాలంలో ఓడించిన సందర్భాలు తక్కువే అయినా భారత్‌ గెలుస్తుందన్న ఆశలు స్వల్పమే. ఐతే ఆట సాగే కొద్దీ అంచనాలు తారుమార‌య్యాయి. మ్యాచ్‌లో ఎక్కువ శాతం బెల్జియం నియంత్రణలోనే ఉన్నా.. భారత్‌ ఆ జట్టును స్వేచ్ఛగా కదలనివ్వలేదు. మొద‌టి రెండు క్వార్టర్స్‌లో భారతే ఎక్కువ గోల్‌ అవకాశాలు సృష్టించుకున్నా వృథా అయ్యాయి. మ్యాచ్‌లో అర్థభాగం ముగిసేసరికి రెండు జట్లు గోల్స్‌ చేయడంలో విఫలమయ్యాయి. మూడో క్వార్టర్‌లో ఆట వేగం ఒక్కసారిగా పెరిగి మొత్తం మూడు గోల్స్‌ అయ్యాయి. గుర్జాంత్‌ భారత్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు.

మరో నాలుగు నిమిషాల్లోనే ఆధిక్యం 2-0 అయ్యింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. ఐతే అక్కడి నుంచి మళ్లీ బెల్జియం హవా సాగింది. ఏడు నిమిషాల వ్యవధిలో లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లను ఆ జట్టు సద్వినియోగం చేయడంతో స్కోరు 2-2తో సమమైంది.

46వ నిమిషంలో రూపిందర్‌ పాల్‌ సింగ్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌ చేయడంతో భారత్‌ 3-2 ఆధిక్యంలో నిలిచింది. ఐతే ఆధిక్యం నిలవలేదు. 53వ నిమిషంలో బెల్జియం ఆటగాడు కీటర్స్‌ ఫీల్డ్‌ గోల్‌ కొట్టడంతో మ్యాచ్‌ 3-3తో సమమైంది. ఆ తర్వాత మరో గోల్‌ నమోదవకపోవడంతో మ్యాచ్‌ షూటౌట్‌కు దారితీసింది.

వేగం పుంజుకున్న ఆకాశ్‌: మ్యాచ్‌లో ఎక్కువ శాతం బెంచ్‌కే పరిమితమైన గోల్‌కీపర్‌ ఆకాశ్‌ మ్యాచ్‌లో హీరోగా మారాడు. షూటౌట్‌లో బెల్జియం తొలి మూడు ప్రయత్నాల్లో రెండు అవకాశాలను అతనే వృథా చేశాడు. మొత్తం ఐదు పెనాల్టీల్లో బెల్జియం రెండింటిని మాత్రమే గోల్స్‌గా చేసుకోగా భారత ఆటగాళ్లు కూడా నిరాశపరిచారు. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, సుమిత్‌, ఆకాశ్‌దీప్‌ సింగ్‌ గోల్స్‌ చేయడంలో విఫలమయ్యారు. ఉపాధ్యాయ్‌ లలిత్‌, రూపిందర్‌ పాల్‌ సింగ్‌లు గోల్స్‌ చేశారు.

ఐదు అవకాశాలు ముగిసేసరికి స్కోరు 2-2తో సమమమైంది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నిరాశపరచకుండా అవకాశాన్ని సద్వినియోగం చేయడంతో భారత్‌ 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. బెల్జియం తరఫున వాన్‌ డోరెన్‌ పెనాల్టీ అవకాశాన్ని తీసుకున్నాడు. ఆకాశ్‌ను బోల్తా కొట్టించి అతడు గోల్‌ చేసేందుకు ప్రయత్నించినా. అతడి ఆటలను సాగనివ్వలేదు ఆకాశ్‌.

Story first published: Thursday, December 7, 2017, 9:59 [IST]
Other articles published on Dec 7, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+