భువనేశ్వర్‌లో హాకీ వరల్డ్‌కప్: తొలి టికెట్ కొనుగోలు చేసిన ఒడిషా సీఎం

హైదరాబాద్: 14వ హాకీ వరల్డ్ కప్‌కు సర్వం సిద్ధమైంది. నవంబర్‌లో జరగనున్న హాకీ వరల్డ్ కప్‌కు భువనేశ్వర్‌లోని కలింగ అంతర్జాతీయ హాకీ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. టోర్నీలో భాగంగా వరల్డ్‌కప్ ఓపెనింగ్ మ్యాచ్‌కి సంబంధించిన తొలి టికెట్‌ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనుగోలు చేశారు.
పురుషుల హాకీ వరల్డ్‌కప్ ఆరంభోత్సవ కార్యక్రమం నవంబర్ 27న అట్టహాసంగా జరగనుండగా ప్రారంభోత్సవ టికెట్ కోసం ముఖ్యమంత్రి రూ.500 చెల్లించి కొనుగోలు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. హాకీ ఇండియా సీఈఓ ఎలీనా నార్మన్ తొలి టికెట్‌ను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు అందజేశారు.

మంగళవారం నుంచి ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలు
భువనేశ్వర్ కళింగ స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. నవంబర్ 28న కటక్ బారాబతి స్టేడియంలో రెండో సెర్మనీకి ఏర్పాట్లు చేస్తున్నారు. హాకీ వరల్డ్ కప్‌కు సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు హాకీ ఇండియా ఓ ప్రకటన చేసింది.

ఆరంభోత్సవ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ సంగీతం
హాకీ ఇండియా ఆరంభోత్సవ కార్యక్రమాల్లో ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తన సంగీతంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇక, బాలీవడ్ బాద్ షారుఖ్ ఖాన్ పాటు పలువురు ప్రముఖ బాలీవుడ్ నటీనటులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సందడి చేయనున్నారు. హాకీ వరల్డ్ కప్‌లో మొత్తం 16 దేశాలు పాల్గొంటున్నాయి.

నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు
నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు ఈ మెగా టోర్నీకి భువనేశ్వర్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు డిపెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగబోతోంది. టోర్నీలో పాల్గొనే మొత్తం 16 జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. అన్ని జట్లు కూడా గ్రూప్ స్టేజిలో మూడు మ్యాచ్‌లు ఆడతాయి. డిసెంబర్ 9 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.

హాకీ వరల్డ్ కప్‌కు భారత జట్టు:
గోల్‌కీపర్లు: పీఆర్ శ్రీజేశ్, క్రిషన్ బహదూర్ పాఠక్
డిఫెండర్లు: హర్మన్‌ప్రీత్ సింగ్, బీరేంద్ర లాక్రా, వరుణ్ కుమార్, కోతాజిత్ సింగ్, ఖడాంగ్‌బమ్, సురేంద్ర కుమార్, అమిత్
మిడ్‌ఫీల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), చింగ్లేన్‌సానా(వైస్ కెప్టెన్), నీలకంఠశర్మ, హార్ధిక్ సింగ్, సుమిత్
ఫార్వర్డ్స్: ఆకాశ్‌దీప్ సింగ్, మన్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, లలిత్‌కుమార్ ఉపాధ్యాయ, సిమ్రన్‌జీత్ సింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications