Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హాకీ వరల్డ్‌కప్: కెనడాతో మ్యాచ్ డ్రా, దక్షిణాఫ్రికా నాకౌట్ ఆశలు సజీవం

Hockey World Cup: Canada, South Africa keep knockout hopes alive after 1-1 draw

హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్ కప్‌లో ఆదివారం కెనడా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఎన్‌బైల్ నుత్లి(43ని) గోల్ చేయగా, స్కాట్ టప్పర్(45ని) కెనడాకు ఏకైక గోల్ అందించాడు.

మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఒకరి గోల్‌పోస్ట్‌పై మరొకరు దాడులు చేసినప్పటికీ, ఇరు జట్ల డిఫెన్స్‌ బలంగా ఉండటంతో గోల్ కాలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసేసరికి ఎలాంటి గోల్ నమోదుకాలేదు. మూడో క్వార్టర్ చివరి నిమిషంలో ఎన్‌బైల్ నుత్లి చేసిన ఫీల్డ్‌గోల్‌తో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆ తర్వాత రెండు నిమిషాల తేడాతో తమకు దక్కిన పెనాల్టీ స్ట్రోక్‌ను కెప్టెన్ స్కాట్ గోల్‌గా మలువడంతో స్కోరు 1-1తో సమమైంది. అనంతరం ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ప్రత్యర్ధి జట్ల గోల్ గోల్‌పోస్ట్‌పై దాడులకు పూనుకున్నప్పటికీ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో చివరకు మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది.

కాగా, లీగ్ స్టేజిలో భాగంగా టీమిండియా తన ఆఖరి మ్యాచ్‌లో కెనడాతో తలపడుతుండగా దక్షిణాఫ్రికా జట్టు బెల్జియంతో ఆడనుంది.

Story first published: Monday, December 3, 2018, 12:45 [IST]
Other articles published on Dec 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+