భారత్ బోణీ.. పాక్ బోల్తా!
Hockey World Cup 2026: హాకీ ప్రపంచ కప్ 2026 ప్రారంభమైంది. భారత జట్టు వేల్స్ తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 3-1 తేడాతో విజయం సాధించింది. భారత జట్టు పూల్ డీలో ఉంది. ఇందులో పాకిస్థాన్ కూడా ఉంది. శనివారం పాకిస్థాన్ కూడా 2026 ప్రపంచ కప్‌లో తమ తొలి మ్యాచ్ ఆడింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ పరాజయం పాలైంది.
పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ విజయం
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించడానికి ఇంగ్లాండ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. నెదర్లాండ్స్‌లో ఆమ్‌స్టెల్వీన్‌లోని వాగ్నర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ 12వ నిమిషంలో స్టువర్ట్ రష్‌మేయర్ ఇంగ్లండ్‌కు ఆధిక్యాన్ని అందించాడు. 28వ నిమిషంలో శామ్యూల్ వార్డ్, 31వ నిమిషంలో సామ్ హూపర్, 47వ నిమిషంలో జేమ్స్ ఆల్బరీ గోల్స్ చేశారు. 50వ నిమిషంలో అఫ్రాజ్ ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తరఫున ఏకైక గోల్ చేశాడు.

ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ అత్యంత విజయవంతమైన జట్టు
హాకీ ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్థాన్ అత్యంత విజయవంతమైన దేశంగా నిలిచిన సంగతి తెలిసిందే. 1971లో ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్ రికార్డు స్థాయిలో 4 సార్లు హాకీ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. తొలి ప్రపంచ కప్‌ను కూడా పాకిస్థాన్ గెలుచుకుంది. అయితే భారతదేశంలో జరిగిన 2023 ప్రపంచ కప్‌కు ఆ జట్టు అర్హత సాధించలేకపోయింది. ఈ ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ విజయవంతంగా స్థానం సంపాదించుకుంది.
ఆగస్టు 19న భారత్, పాకిస్తాన్ మ్యాచ్
2026 హాకీ ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ కూడా పోటీపడనున్నాయి . ఈ రెండు జట్లు ఆగస్టు 19న తలపడనున్నాయి. అంతకు ముందు, ఆగస్టు 17న భారత్ ఇంగ్లాండ్‌తో తలపడనుండగా.. పాకిస్థాన్ వేల్స్‌తో తలపడుతుంది.
హాకీ ప్రపంచ కప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. వాటిని నాలుగు పూల్స్‌గా విభజించారు. ప్రతి పూల్‌లోని అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు రెండో రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. అక్కడ వాటిని ఒక్కో పూల్‌లో 4 జట్లు ఉండేలా రెండు పూల్స్‌గా విభజిస్తారు. ప్రతి జట్టు తమ పూల్‌లోని జట్లతో మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. హాకీ ప్రపంచ కప్ ఫైనల్ ఆగస్టు 30న జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
