హాకీ వరల్డ్‌కప్: 28ఏళ్ల తర్వాత బరిలోకి ఫ్రాన్స్, విజేతకు ఇచ్చే ట్రోఫీ ప్రత్యేకతలివే

హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా 14వ హాకీ వరల్డ్‌కప్ సంబరానికి తెరలేచింది. మొత్తం 16 దేశాలు పాల్గొనే ఈ వరల్డ్‌కప్‌లో 19 రోజుల పాటు 36 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు.
టోర్నీలో భాగంగా ఆతిథ్య భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇప్పటివరకు భారత్-దక్షిణాఫ్రికా జట్లు 11 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. భారత్ ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందగా... దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌లో నెగ్గింది. మరో ఐదు మ్యాచ్‌లు 'డ్రా'గా ముగిశాయి.
ఆ తర్వాత డిసెంబర్ 2న బెల్జియంతో, డిసెంబర్ 8న కెనడాతో భారత్ తలపడనుంది. 1975లో మలేషియాలో జరిగిన టోర్నీలో అజిత్‌పాల్ సింగ్ సారథ్యంలోని టీమిండియా తొలిసారి వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో దాయాది పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో కప్‌ను ఒడిసిపట్టుకుంది.
అంతకుముందు జరిగిన 1971, 1973 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ వరుసగా కాంస్య, రజత పతకాలు దక్కించకుంది. ఈసారి ఆతిథ్య భారత్‌తో పాటు డిపెంఢింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనాలతో పాటు నెదర్లాండ్స్, జర్మనీలు ఫేవరేట్‌గా బరిలోకి దిగనున్నాయి.
2010లో సొంతగడ్డపై జరిగిన వరల్డ్‌కప్‌లో దారుణంగా విఫలమై ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత్, ఈసారి భారీ అంచనాలతోనే బరిలో దిగుతోంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న భారత హాకీ జట్టు ఈ వరల్డ్‌కప్‌లో కనీసం సెమీస్ బెర్త్‌నైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
ఈ హాకీ వరల్డ్‌కప్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు:

హాకీ వరల్డ్ కప్‌లో ఆడుతోన్న జట్లు:
పూల్ ఎ: అర్జెంటీనా, న్యూజిలాండ్, స్పెయిన్, ఫ్రాన్స్
పూల్-బి: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, చైనా
పూల్-సి: భారత్, బెల్జియం, దక్షిణాఫ్రికా, కెనడా
పూల్-డి: నెదర్లాండ్స్, జర్మనీ, మలేసియా, పాకిస్థాన్

హాకీ వరల్డ్‌కప్‌లో టీమిండియా మ్యాచ్‌లు
నవంబరు 28 భారత్ Vs దక్షిణాఫ్రికా
డిసెంబర్ 2 భారత్ Vs బెల్జియం
డిసెంబర్ 8 భారత్ Vs కెనడా

వరల్డ్‌కప్ ఫార్మాట్
ఈ టోర్నీలో ఆడుతున్న జట్ల సంఖ్య 16. ఇన్ని జట్లు ఆడడం హాకీ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. 2002లో జరిగిన హాకీ వరల్డ్‌కప్‌లో చివరిగా 16 జట్లు ఆడాయి. మొత్తం 16 జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. ప్రతి జట్టు పూల్‌లో మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. పూల్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్స్ చేరతాయి. మూడు పూల్స్‌లో 2, 3 స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌లో స్థానం కోసం క్రాస్‌ఓవర్ మ్యాచ్‌లు ఆడతాయి. డిసెంబర్ 10, 11 తేదీల్లో క్రాస్‌ఓవర్ మ్యాచ్‌లు, 12, 13 తేదీల్లో, సెమీస్ 15న, ఫైనల్ 16న జరుగుతాయి.

హాకీ వరల్డ్‌కప్‌కు ట్రోఫీ ప్రత్యేకత
1971లో తొలిసారి హాకీ వరల్డ్‌కప్ మొదలైంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఈ వరల్డ్‌కప్‌లో విజేతగా జట్టుకు ఇచ్చే ట్రోఫీని 1971లో పాకిస్థాన్ సైనిక కమాండర్ బషీర్ ముజిద్ ఆధ్వర్యంలో తయారైంది. పాక్ సైన్యంలోని ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్స్ కార్ప్స్ విభాగం ఈ కప్‌ను రూపొందించింది.

28 ఏళ్ల తర్వాత హాకీ వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్న ఫ్రాన్స్
28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫ్రాన్స్ జట్టు హాకీ వరల్డ్‌కప్‌లో ఆడుతుంది. చివరిగా 1990లో ఫ్రాన్స్ ఈ టోర్నీలో పాల్గొంది. ఈ కప్‌లో ఆడుతున్న పెద్ద ర్యాంకు కలిగిన జట్టుగా కూడా ఫ్రాన్స్ (20వ ర్యాంకు) నిలిచింది. ఇదిలా ఉంటే, ఈ వరల్డ్‌కప్‌లో దక్షిణ కొరియా, జపాన్ టోర్నీ ఆడే అవకాశాన్ని కోల్పోగా.. చైనా తొలిసారి ప్రపంచకప్ ఆడుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications