

హైదరాబాద్: ఒడిశాలోని భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్ కప్‌లో భారత హాకీ జట్టు సెమీఫైనల్ మ్యాచ్ ముంగిట బోల్తా పడింది. టోర్నీలో భాగంగా నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో 1-2 తేడాతో భారత ఓడిపోయింది. దీంతో 43 ఏళ్ల తర్వాత హకీ వరల్డ్ కప్ సెమీస్‌కు చేరే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది.
హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్ చేరి 43 ఏళ్లయ్యింది. 1975లో ఆఖరిసారిగా వరల్డ్‌కప్ సెమీస్‌లో ఆడిన భారత్ నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచింటే సెమీస్‌లో అడుగుపెట్టేది. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో క్వార్టర్స్‌కి దూసుకెళ్లిన భారత్ జట్టు ఈ మ్యాచ్‌లో ఆట 12వ నిమిషంలోనే భారత్ తొలి గోల్ సాధించింది.

ఆకాశ్‌దీప్‌సింగ్ అద్భుతమైన రివర్స్ ఫ్లిక్‌తో నెదర్లాండ్స్‌ని డిఫెన్స్‌ని ఛేదించుకుంటూ సమష్టిగా గోల్‌పోస్టుపై భారత్ దాడిచేసి భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. 15వ నిమిషంలో నెదర్లాండ్స్ ఆటగాడు బ్రిక్‌మ్యాన్ గోల్ సాధించి ఆధిక్యాన్ని 1-1తో సమం చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
ఇరు జట్ల ఆటగాళ్లు నువ్వా నేనా అని తలపడినా.. హాఫ్ టైమ్ ముగిసే వరకూ మరో గోల్ నమోదవలేదు. ఈ క్రమంలో 50వ నిమిషంలో నెదర్లాండ్ ఆటగాడు మింక్ వాండెర్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి తమ జట్టుకు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత భారత్ ఎంత ప్రయత్నించినా భారత్‌కు గోల్ చేసే అవకాశం దక్కలేదు.
ఈ మ్యాచ్ చివర్లో దొరికిన పెనాల్టీ కార్నర్ అవకాశాల్ని చేజార్చుకున్న భారత్ సొంతగడ్డపై అభిమానుల్ని నిరాశపరిచింది. తాజా ఓటమితో హాకీ వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు నెదర్లాండ్స్‌తో ఏడు సార్లు తలపడిన భారత్.. ఒక్కసారి కూడా విజయాన్ని నమోదు చేయలేదు. గత ఐదు మ్యాచ్‌ల్లో ఓడి, ఓ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.
చివరిసారిగా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో నెదర్లాండ్స్‌ను ఢీకొంది. ఆ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెదర్లాండ్స్ 4వ స్థానంలో ఉంటే భారత్ దాని వెనకే ఐదో స్థానంలో ఉంది.