'130 కోట్ల మంది ఆశలన్నీ మా పైనే.. నిలబెడతాం'

భువనేశ్వర్: ఎలాంటి సవాలునైనా ఎదుర్కొని పురుషుల హాకీ ప్రపంచకప్ క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ను గెలుస్తామని భారత జట్టు కోచ్ హరేంద్ర సింగ్ అంటున్నాడు. ఇందులో విజయం సాధిస్తే 43 ఏళ్ల తర్వాత సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన జట్టుగా భారత్ నిలుస్తోంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ సమరంలో ప్రత్యర్థి నెదర్లాండ్స్‌ను గెలవడం అంత సులువేమీ కాదు. గతంలో ఓ సారి 1975లో సెమీస్ చేరడంతో పాటు టైటిల్‌నూ ఎగరేసుకుపోయిన భారత్.. మరోసారి కప్పు అందుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్ కఠిన సవాలుకు సిద్ధమైంది.

6 మ్యాచ్‌ల్లో భారత్ 5 ఓడి, 1 డ్రాగా
ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఆ జట్టుతో ఆడిన 6 మ్యాచ్‌ల్లో భారత్ 5 ఓడి, 1 డ్రాగా ముగించింది. చివరిసారిగా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో నెదర్లాండ్స్‌ను ఢీకొంది. ఆ మ్యాచ్‌లోనూ 1-1తో డ్రాగా ముగించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెదర్లాండ్స్ 4వ స్థానంలో ఉంటే భారత్ దాని తర్వాతి ఐదో స్థానంలో ఉంది. ర్యాంకింగ్స్, ఫామ్ ప్రకారం చూసినా 2 జట్లు సమానంగానే ఉన్నాయని చెప్పొచ్చు.

శారీరకంగా, మానసికంగా సిద్ధమైయ్యాం.
ఈ మ్యాచ్‌పై భారత కోచ్ హరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ‘మేం అనుకున్నదే జరగబోతుంది. దేశంలోని 130 కోట్ల ప్రజలకు ఏం కావాలో.. మాకూ అదే కావాలి. క్వార్టర్స్ మ్యాచ్‌కు శారీరకంగా, మానసికంగా సిద్ధమైయ్యాం. ప్రత్యర్థి జట్టు దూకుడును అడ్డుకునేందుకు సరైన వ్యూహాలు రచించాం. నెదర్లాండ్స్ నుంచి ఎలాంటి సవాలు ఎదురైనా జవాబివ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. ప్రపంచకప్‌ల్లో ఇప్పటి వరకు నెదర్లాండ్స్‌పై గెలిచి ఉండకపోవచ్చు.

వారికి అవకాశమివ్వకుండా పట్టేస్తాం
ఈసారి మాత్రం ఫలితం అలాగే ఉంటుందనుకోవడానికి లేదు. కచ్చితంగా ఉత్తమ ఆటతీరు ప్రదర్శించిన జట్టే గెలిచితీరుతుంది. క్వార్టర్స్ మ్యాచ్‌లో చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని బలంగా నిర్ణయించుకున్నాం. పెనాల్టీ కార్నర్లు సాధించడంలో వాళ్లు బలంగా కనిపిస్తున్నా.. అవకాశాన్ని ఇవ్వకూడదనుకుంటున్నాం. సొంత గడ్డ మధ్య ఆడుతుండటంతో మరింత బలాన్నిస్తుందని ఆశిస్తున్నాం. సెమీస్ చేరి చరిత్ర సృష్టించగలమనే ఆశిస్తున్నాం' అని హరేంద్ర తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications