'ఫైనల్ చేరేందుకు అనుసరిస్తున్న సీక్రెట్ ఇదే'

భువనేశ్వర్: సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో గెలిచి ప్రపంచకప్‌ను అందుకోవాలని ఉవ్విళ్లూరుతోన్న భారత జట్టుకు లీగ్‌మ్యాచ్‌లో కఠిన సవాల్ ఎదురుకానుంది. ప్రపంచ నెం. 3 ర్యాంకర్ రెడ్‌జెయింట్స్‌గా పేరున్న బెల్జియం జట్టుతో ఆదివారం జరిగే కీలకమ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. పూల్-సీలో భాగంగా విజయం సాధించిన జట్టుకు అగ్రస్థానంతో నేరుగా క్వార్టర్స్ బెర్త్ సాధించే అవకాశం ఉంటుంది.

రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరాటం
దీంతో ఈ మ్యాచ్‌లో విజయం కోసం రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరాటం జరగనుంది. దాదాపు ఐదేళ్లుగా బెల్జియం జట్టు నిలకడగా ఆడుతుండగా.. భారత్ మాత్రం ఒక మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించినా అంతకంటే ఘోరంగా ఓడిపోతూ నిలకడలేమితో బాధపడుతోంది. కాగా.. ఈ ప్రపంచకప్‌లో మాత్రం భారత్ జట్టు మంచి సమతూకంతో కనిపిస్తోంది.

దక్షిణాఫ్రికాపై 5-0తో గెలిచి శుభారంభం
దక్షిణాఫ్రికాపై 5-0తో గెలిచి హాకీ ప్రపంచ కప్‌లో శుభారంభం చేసిన భారత్.. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత బెల్జియంతో ఆదివారం జరగనున్న రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి చేరుకోవచ్చు. దీంతో బెల్జియంతో మ్యాచ్ తమకు ప్రిక్వార్టర్ ఫైనల్ లాంటిదేనంటూ టీమిండియా ప్రధాన కోచ్ హరేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు.

టీమిండియాతో పాటు బెల్జియం, దక్షిణాఫ్రికా, కెనడా
పూల్-సిలో టీమిండియాతో పాటు బెల్జియం, దక్షిణాఫ్రికా, కెనడా జట్లు కూడా ఉన్నాయి. ఇందులో మొదటి స్థానంలో నిలిచిన జట్టు మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించినట్లే. ఇలా 4 పూల్స్‌లో అగ్ర స్థానంలో నిలిచిన 4 జట్లు క్వార్టర్స్‌కు వెళ్తాయి. 2, 3 స్థానాల్లో నిలిచిన జట్లకు విడిగా మరో మ్యాచ్ ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు క్వార్టర్స్‌లో అడుగుపెడుతుంది. ఈ పరిస్థితి రాకుండా నేరుగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టాలంటే ఆదివారం జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది.

ఫైనల్‌కి వెళ్లడంపైనే దృష్టి సారించినట్లు
బెల్జియం ఇప్పటికే 2-1తో కెనడాను ఓడించి ఊపు మీదుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు వారు మొదటి స్థానంలో నిలుస్తోంది. దీనిపై కోచ్ మాట్లాడుతూ.. మాపై భారత జట్టుకు ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. టోర్నీలో ఒక్కో మ్యాచ్ గెలిచి ఫైనల్‌కి వెళ్లడంపైనే దృష్టి సారించినట్లు వ్యాఖ్యానించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications