హాకీ వరల్డ్‌కప్ 2018: న్యూజిలాండ్ vs అర్జెంటీనా మ్యాచ్ హైలెట్స్

హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్ కప్‌లో ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. పూల్-ఏ మ్యాచ్‌లో భాగంగా సోమవారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 3-0 గోల్స్ తేడాతో అర్జెంటీనా జట్టు ఘన విజయం నమోదు చేసింది.
అర్జెంటీనా తరఫున అగస్టిన్ మాజిల్ (23వ ని) లుకాస్ విల్లా (41వ ని), లుకాస్ మార్టినెజ్ (55వ ని) గోల్స్ చేశారు. తాజా విజయంతో అర్జెంటీనా 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ (3 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు ఆద్యంతం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

తొలి మ్యాచ్‌లో 4-3గోల్స్ తేడాతో
లీగ్ స్టేజిలో స్పెయిన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4-3గోల్స్ తేడాతో గెలిచిన అర్జెంటీనాకు తాజా విజయం వరుసగా రెండోది కావడం విశేషం. ఈ విజయంతో అగ్రస్థానంతో దాదాపు నేరుగా క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. డిసెంబర్ 6వ తేదీన అర్జెంటీనాతో ఫ్రాన్స్‌తో తలపడనుండగా, క్వార్టర్స్ బెర్త్ కోసం న్యూజిలాండ్‌తో స్పెయిన్ అమీతుమీ తేల్చుకోనుంది.

స్పెయిన్‌తో ఫ్రాన్స్ మ్యాచ్ డ్రా
మరోవైపు, పూల్-ఎలోనే స్పెయిన్-ఫ్రాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్న స్పెయిన్‌కు ఫ్రాన్స్ పెద్ద షాక్ ఇచ్చింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో దాదాపు స్పెయిన్‌ను ఓడించినంత పని చేసింది. చివరలో జట్టు కెప్టెన్, గోల్‌కీపర్ క్వికో కోర్టెస్ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలచడంతో స్పెయిన్ 1-1తో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

ఆట ప్రారంభమైన ఆరో నిమిషంలోనే
ఆట ప్రారంభమైన ఆరో నిమిషంలోనే ఫ్రాన్స్ ఆటగాడు తిమోతీ క్లెమెంట్ అద్భుతమైన ఫీల్డ్‌గోల్‌తో స్పెయిన్ షాక్‌కు గురైంది. 1-0 ఆధిక్యంతో ఆటను చివరి వరకు కొనసాగించింది. మూడు క్వార్టర్లలోనూ ఫ్రాన్స్ డిఫెన్స్‌ను స్పెయిన్ ఛేదించలేక పోవడం విశేషం. చివరి పది నిమిషాల్లో లభించిన పెనాల్టీస్ట్రోక్‌తో గోల్ నమోదు చేయడంతో ఫ్రాన్స్ సంచలన విజయం సాధించలేకపోయింది.

హాకీ వరల్డ్‌కప్‌లో మంగళవారం నాటి మ్యాచ్‌లు
ఇంగ్లాండ్ Vs ఆస్ట్రేలియా (సాయంత్రం 5 నుంచి)
ఐర్లాండ్ Vs చైనా (రాత్రి 7 నుంచి) (స్టార్‌స్పోర్ట్స్‌లో)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications