న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాకీ వరల్డ్ కప్ 2018: నెదర్లాండ్స్‌కు షాకిచ్చి క్వార్టర్స్‌కు చేరువైన జర్మనీ

Hockey World Cup 2018: Germany Thrash Netherlands, Malaysia Hold Pakistan To A Draw

భువనేశ్వర్‌: హాకీ ప్రపంచకప్‌లో జర్మనీ క్వార్టర్‌ ఫైనల్‌ బెర్తును దాదాపుగా చేజిక్కించుకున్నట్లే. ప్రపంచ నాలుగో ర్యాంకర్‌..గత ప్రపంచకప్‌ రన్నరప్‌ అయిన నెదర్లాండ్స్‌కు జర్మనీ షాక్‌ ఇచ్చింది. బుధవారం హాకీ వరల్డ్‌కప్‌ పూల్‌-డిలో ఈ రెండు జట్లకు మధ్య జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 4-1తో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. మొత్తం 6 పాయింట్లతో పూల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

మథియాస్‌ ముల్లర్‌ (30వ నిమిషం), లూకాస్‌ విండ్‌ఫెడర్‌ (52), మార్కో (54), క్రిస్టఫర్‌ (58) జర్మనీకి గోల్స్‌ అందించారు. పూల్‌-డిలో పాకిస్థాన్‌, మలేసియా మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. ఏకపక్షంగా సాగి న ఈ పోరులో జర్మనీ సమష్టిగా రాణించింది. నెదర్లాండ్స్‌ తరఫున వాలెంటైన్‌ వెర్గా (13వ నిమిషంలో) గోల్‌ చేశాడు. జర్మనీ నుంచి ముల్లర్‌ (30వ), లుకాస్‌ విండ్‌ఫెడరర్‌ (52వ), మార్కో (54వ), క్రిస్టోఫర్‌ (58వ) గోల్స్‌ చేశారు.

తొలి క్వార్టర్‌లో దూకుడుగా కనిపించిన నెదర్లాండ్స్‌ 13వ నిమిషంలో గోల్‌ చేసి ఆధిక్యాన్ని సంపాదించింది. ఆ తర్వాత రక్షణాత్మకంగా ఆడతూ ప్రత్యర్థిని నిలువరించడానికే ప్రయత్నించింది. ఈ సమయంలో పుంజుకున్న జర్మనీ రెండో క్వార్టర్లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి 1-1తో స్కోరును సమం చేసింది.

చివరి క్వార్టర్లో జర్మన్‌ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగి గెలిచారు. పూల్‌-డిలో పాకిస్థాన్‌-మలేసియా మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. చివరి క్వార్టర్లో పాకిస్థాన్‌నుంచి అతిఖ్‌ మహమ్మద్‌ (51వ), మలేసియా నుంచి ఫైజల్‌ (55వ) గోల్స్‌ చేశారు. గురువారం జరగనున్న హాకీ మ్యాచ్‌లో స్పెయిన్‌ వర్సెస్ న్యూజిలాండ్‌‌ల మధ్య సా. 5 గంటల నుంచి ఒక మ్యాచ్ ఆరంభం కాగా, అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్‌ల మధ్య రా. 7 గంటలకు రెండో మ్యాచ్ ఆరంభం కానుంది.

Story first published: Thursday, December 6, 2018, 11:37 [IST]
Other articles published on Dec 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X