For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాకీ వరల్డ్ కప్ 2018: సంచలన విజయంతో అర్జెంటీనాకు షాకిచ్చిన ఫ్రాన్స్‌

Hockey World Cup 2018: France stun Olympic champs Argentina, Spain out

న్యూ ఢిల్లీ: పురుషుల హాకీ ప్రపంచకప్‌లో సంచలన విజయం నమోదైంది. టోర్నీలోనే అత్యంత తక్కువ ర్యాంకు (20) జట్టు ఫ్రాన్స్‌.. ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాపై విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ 5-3 తేడాతో అర్జెంటీనాను ఓడించింది. నాకౌట్‌ దశకు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ ఆటగాళ్లు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించారు. ఈ విజయంతో గ్రూప్‌- ఎలో అర్జెంటీనా తర్వాత రెండో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్‌ క్రాస్‌ ఓవర్‌కు అర్హత సాధించింది.

మరో మ్యాచ్‌లో స్పెయిన్ జట్టును 2-2తో నిలువరించిన న్యూజిలాండ్ జట్టు మూడోస్థానంతో క్రాస్ ఓవర్ మ్యాచ్‌లకు అర్హత అందుకోగా.. స్పెయిన్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అల్బెర్ట్‌ (9వ నిమిషంలో), అల్వారో (27వ నిమిషంలో) గోల్స్‌తో స్పెయిన్‌ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ చివరి పది నిమిషాల్లో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఫిలిప్స్‌ (50వ నిమిషంలో) రసెల్‌ (56వ నిమిషంలో) గోల్స్‌తో స్కోరు సమమైంది.

ప్రపంచకప్ ఫార్మాట్ ప్రకారం నాలుగు గ్రూప్‌ల నుంచి అగ్రస్థానంలో నిలిచిన నాలుగుజట్లు నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించనుండగా..రెండో స్థానంతోపాటు మూడో స్థానంలో నిలిచిన జట్లు ఇతర గ్రూప్‌లలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లతో మిగిలిన 4 క్వార్టర్ బెర్తుల కోసం క్రాస్ ఓవర్ మ్యాచ్‌లలో తలపడనున్నాయి. కెరీర్‌లోనే అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన ఫ్రాన్స్‌జట్టు ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాను వణికించింది.

ఫ్రాన్స్ తరఫున హ్యూగో జెంటెస్ట్(18వ), అరిైస్టెడ్ కోయిస్నే(26వ), గాస్పార్డ్ బవుమ్ గార్టెన్(30వ), ఫ్రాంకియోస్ గోయెత్(54వ) నిమిషంలో ఫీల్డ్‌గోల్స్ చేసి అదరగొట్టగా.. 23వ నిమిషంలో ఫ్రాన్స్ కెప్టెన్ విక్టర్ చార్లెట్ పెనాల్టీకార్నర్‌ను గోల్‌గా మలిచాడు. అర్జెంటీనా తరఫున లూకాస్ మార్టినెజ్ (28వ) నిమిషంలో ఫీల్డ్‌గోల్‌తో మెరవగా.. పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ గొంజాలో పెల్లట్(44, 48వ) నిమిషాల్లో లభించిన పెనాల్టీ కార్నర్‌లను గోల్ పోస్టులోకి పంపాడు. మరోవైపు ఓడినా.. గ్రూప్‌లో రెండు విజయాలు, ఒక ఓటమి నమోదు చేసి 6 పాయింట్లు సాధించిన అర్జెంటీనా జట్టు అగ్రస్థానంతో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరింది.

Story first published: Friday, December 7, 2018, 10:58 [IST]
Other articles published on Dec 7, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+