ఇండియా vs దక్షిణాఫ్రికా: ఏడుగురు యువకులే, సమర్ధించుకున్న కోచ్ హరేంద్ర

హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా 14వ హాకీ వరల్డ్‌కప్ సంబరానికి తెరలేచింది. మొత్తం 16 దేశాలు పాల్గొనే ఈ వరల్డ్‌కప్‌లో 19 రోజుల పాటు 36 మ్యాచ్‌లు జరగనున్నాయి. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో తొలి మ్యాచ్ బుధవారం జరగనుంది. పూల్-సిలో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
కోచ్ హరేంద్ర సింగ్ సారథ్యంలో ఉత్సాహంగా కనిపిస్తున్న భారత్.. తొలి మ్యాచ్‌లో ఎలా ఆడుతుందో చూడాలి. హాకీ వరల్డ్‌కప్ వచ్చిన ప్రతిసారీ మంచి అంచనాలతో బరిలో దిగడం.. ఆపై నిరాశపరచడం అలవాటు చేసుకున్న భారత్ ఈసారి సొంతగడ్డపై చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ఉంది. కొత్త కెప్టెన్ మన్‌ప్రీత్‌సింగ్ సారథ్యంలోని భారత జట్టు టోర్నీలోకి దిగుతోంది.
గ్రూపులో తొలి స్థానంలో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఒక్కో గ్రూపు నుంచి రెండు జట్లు క్రాస్ ఓవర్ మ్యాచ్‌ల ద్వారా తలపడి క్వార్టర్స్‌లోకి ప్రవేశిస్తాయి. 2010లో సొంతగడ్డపై జరిగిన వరల్డ్‌కప్‌లో దారుణంగా విఫలమై ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత్, ఈసారి భారీ అంచనాలతోనే బరిలో దిగుతోంది.
వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో తమ(5) కంటే తక్కువ ర్యాంక్(15)లో ఉన్న దక్షిణాఫ్రికాపై విజయంతో బోణీ చేయాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. బలబలాల పరంగా దక్షిణాఫ్రికా కంటే అన్ని విభాగాల్లో మెరుగ్గా కనిపిస్తున్న టీమిండియా భారీ తేడాతో విజయంతో పాయింట్ల ఖాతా తెరవాలనే పట్టుదలతో ఉంది.
రెండేళ్ల క్రితం జూనియర్ జట్టును విశ్వ విజేతగా నిలిపిన అనుభవం ఉన్న హరేంద్ర సింగ్ ఈసారి సీనియర్ టోర్నీలో సైతం సత్తా చాటాలని భావిస్తున్నాడు. జూనియర్ వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ప్రస్తుత సీనియర్ జట్టులో ఉన్నారు. రూపిందర్ పాల్ సింగ్, సునీల్‌లాంటి పలువురు సీనియర్ ఆటగాళ్లను కాదని జూనియర్ ఆటగాళ్లను ఎంపిక చేయడాన్ని కోచ్ సమర్థించుకున్నారు.
ఈ సందర్భంగా కోచ్ మాట్లాడుతూ "18 ఏళ్లు దాటిన వారికి వివాహం చేసుకున్నే హక్కు మన రాజ్యాంగం కల్పిస్తోంది. అలా అనుకుంటే ప్రస్తుత భారత జట్టు జూనియర్ జట్టేంకాదు. ఇది చరిత్ర సృష్టించబోయే జట్టు. మంచి ఫలితాలు రావాలంటే కాస్త ఓపిక పట్టాలి. ఎలాంటి అనవసర ప్రయోగాలకు పోకుండా ముందుగా రచించిన వ్యూహాలను మైదానంలో అమలు చేయాలని, సహజశైలిలో ఆడాలని సలహా ఇస్తున్నాను" అని అన్నారు.
కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, గోల్‌కీపర్ శ్రీజేష్, ఆకాశ్‌దీప్ సింగ్, బీరేంద్ర లక్రా ఆటతీరుపై జట్టు విజయాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తం 18 మందితో ఎంపిక చేసిన జట్టులో ఏడుగురు యువకులే కావడం విశేషం. 19 ఏళ్ల దిల్‌ప్రీత్ సింగ్‌తో పాటు హార్దిక్ సింగ్ ఈ టోర్నీ ద్వారా అరంగేట్రం చేయనున్నారు. అయితే డ్రాగ్‌ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్‌ను జట్టులో నుంచి తప్పించగా స్ట్రయికర్ ఎస్‌వీ సునీల్ గాయం కారణంగా చోటు దక్కలేదు.
ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు 11 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. భారత్ ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందగా... దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌లో నెగ్గింది. మరో ఐదు మ్యాచ్‌లు 'డ్రా'గా ముగిశాయి. ప్రపంచ హాకీ వరల్డ్‌కప్‌లో గత నాలుగు దశాబ్దాలుగా నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రేలియా జట్లు హాకీలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. 1994 సిడ్నీలో జరిగిన టోర్నీలో ఐదోస్థానంలో నిలువడం ఇప్పటివరకు మన అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.
ఇండియా vs దక్షిణాఫ్రికా:
7pm IST at Kalinga Stadium
Live on Star Sports Select 1/ Star Sports Select 1 HD
Live streaming on Hotstar
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications