Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హాకీ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన బెల్జియం

Hockey World Cup 2018: Belgium beat Netherlands in shootout to win maiden title

భువనేశ్వర్: బెల్జియం హాకీ ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో బెల్జియం 3-2తో షూటాఫ్‌లో మాజీ ఛాంపియన్‌ నెదర్లాండ్స్‌ను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు ఎలాంటి గోల్ నమోదు చేయకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. షూటాఫ్‌ తొలి ప్రయత్నంలో నెదర్లాండ్స్‌, బెల్జియం ఆటగాళ్లు గోల్స్‌ చేయలేకపోయారు. రెండో ప్రయత్నంలో నెదర్లాండ్స్‌ గోల్‌ కొట్టగా.. బెల్జియం విఫలమైంది. దీంతో నెదర్లాండ్స్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అక్కడ నుంచి బెల్జియం అనూహ్యంగా పుంజుకుంది.

ఆ జట్టు గోల్‌కీపర్‌ అద్భుతమైన డైవ్‌లతో నెదర్లాండ్స్‌ గోల్‌ ప్రయత్నాలను అడ్డుకోవడంతో ఆ జట్టు మూడుసార్లు గోల్స్‌ చేయడంలో విఫలం కాగా.. బెల్జియం మాత్రం మూడు గోల్స్‌ కొట్టేయడంతో ఆ జట్టు విజయ సంబరాలు చేసుకుంది. మొదటి ఐదు షాట్లలో ఇరు జట్ల స్కోరు 2-2తో సమమైంది.

దీంతో విజేతను నిర్ణయించేందుకు సడెన్‌డెత్ నిర్వహించగా..హెర్ట్‌బెర్గర్ విఫలం కాగా..వాన్ అబెల్ గోల్‌తో బెల్జియం తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. కానీ ఆర్థర్‌ కొట్టిన షాట్‌ ఫౌల్‌ కావడంతో రిఫరీ ఆ గోల్‌ను నిరాకరించడం, నెదర్లాండ్స్‌ గోల్‌ చేయడంతో మళ్లీ ఉత్కంఠ నెలకొంది.

అయితే ఫ్లోరెంట్‌ గురి తప్పకపోవడంతో బెల్జియం 3-2తో గెలిచి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయింది. బెల్జియం కప్పు గెలవడం ఇదే తొలిసారి. అంతకుముందు జరిగిన కాంస్య పతక పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 8-1 తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది.

Story first published: Monday, December 17, 2018, 9:20 [IST]
Other articles published on Dec 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+