Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒలింపిక్స్‌కు అడుగుదూరంలో: రష్యాపై పురుషులు, అమెరికాపై మహిళలు విజయం

Hockey Womens Olympic Qualifiers: India thrashes USA 5-1

హైదరాబాద్: హాకీ ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో భారత మహిళల, పురుషుల హాకీ జట్లు అద్భుత ప్రదర్శన చేశారు. పురుషుల జట్టు 4-2తో రష్యాపై గెలవగా, మహిళల జట్టు 5-1తో అమెరికాను ఓడించింది. సొంత ప్రేక్షకుల మధ్య మన అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

భారత్ తరుపున గుర్జీత్‌ కౌర్‌ (42వ, 51వ నిమిషం) రెండు గోల్స్‌ చేయగా.. లిమిమా మిన్జ్‌ (28వ), షర్మిలా దేవి (40వ), నవ్‌నీత్‌ కౌర్‌ (46వ) తలో గోల్‌ సాధించారు. అమెరికా తరఫున ఎరిన్‌ మాట్సన్‌ (54వ) ఒక్కతే గోల్‌ కొట్టింది. రెండో క్వార్టర్‌ ఆరంభంలోనే భారత్‌కు గోల్‌ చేసే అవకాశం దక్కినా దానిని ఉపయోగించుకోలేదు.

రెండో క్వార్టర్‌ ముగుస్తుందనగా

రెండో క్వార్టర్‌ ముగుస్తుందనగా

రెండో క్వార్టర్‌ ముగుస్తుందనగా లిలిమా (28వ ని) అద్భుతమైన షాట్‌తో గోల్‌ చేసి భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. మూడో క్వార్టర్స్‌లో భారత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసింది. షర్మిల ఫీల్డ్‌ గోల్‌ చేయగా.. పెనాల్టీ కార్నర్‌ను గుర్జిత్‌ గోల్‌గా మలచి భార త్‌ను 3-0 ఆధిక్యంలో నిలిపింది.

చివరి క్వార్టర్‌ ఆరంభంలోనే

చివరి క్వార్టర్‌ ఆరంభంలోనే

చివరి క్వార్టర్‌ ఆరంభంలోనే నవ్‌నీత్‌ కౌర్‌ (46వ ని) చేసిన గోల్‌తో 4-0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. అమెరికా పెనాల్టీ ఏరియాలో పాస్‌ను అందుకున్న నవ్‌నీత్‌ గోల్‌ చేసింది. ఆ తర్వాత యుఎస్‌ఏ డిఫెండర్‌ కావాలని అడ్డుకోవడంతో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్‌ లభించింది. 51వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌తో గుర్జీత్‌ రెండో గోల్‌ కొట్టింది.

54వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌

54వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌

యుఎస్‌ఏకు కూడా భారత్‌ మాదిరే 54వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ దక్కగా ఎరిన్‌ మాట్సన్‌ గోల్‌ చేసి ఆధిక్యాన్ని తగ్గించింది. ఇరుజట్ల మధ్య రెండో మ్యాచ్‌ శనివారం జరగనుంది. ఈ మ్యాచ్‌ డ్రా చేసుకున్నా భారత్‌కు ఒలింపిక్‌ బెర్తు లభిస్తుంది. ఒకవేళ ఓడినా భారత్‌ తన 4 గోల్స్‌ తేడాలో మ్యాచ్‌ను కాపాడుకుంటే ఒలింపిక్స్‌ టికెట్‌ ఖరారు కానుంది.

రష్యాపై గెలిచిన పురుషుల జట్టు

రష్యాపై గెలిచిన పురుషుల జట్టు

మరోవైపు రష్యాపై భారత పురుషుల జట్టు 4-2తో కష్టపడి గెలిచింది. ఏకపక్షంగా సాగుతుందని భావించిన ఈ మ్యాచ్‌లో రష్యా అద్భుత ప్రదర్శనతో భారత్‌కు గట్టిపోటీ ఇచ్చింది. తొలి క్వార్టర్‌ మొదలైన నిమిషంలోపే పెనాల్టీ స్ట్రోక్‌ను సద్వినియోగం చేస్తూ హర్మన్‌ప్రీత్‌ గోల్‌ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అయితే రెండో క్వార్టర్‌లో ఎదురుదాడి చేసిన రష్యా.. కురెవ్‌ చేసిన గోల్‌తో స్కోరు సమం చేసింది.

59వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా

59వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా

మన్‌దీప్‌సింగ్‌ (24వ) చేసిన కళ్లుచెదిరే ఫీల్డ్‌ గోల్‌తో మళ్లీ జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. మూడో క్వార్టర్‌లో భారత్‌ మరింత చెలరేగింది. సునీల్‌ (48వ ని) గోల్‌ చేసి భారత్‌ ఆధిక్యాన్ని 3-1కు పెంచగా.. ఆ వెంటనే మన్‌దీప్‌ మరో గోల్‌ కొట్టి 4-1తో పటిష్టస్థితిలో నిలిపాడు. మరో నిమిషంలో మ్యాచ్‌ ముగుస్తుందనగా రష్యా ఆటగాడు మట్‌కోస్కి (59వ ని) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు.

Story first published: Saturday, November 2, 2019, 8:26 [IST]
Other articles published on Nov 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+