క్రికెట్ కిచ్చే ప్రాధాన్యం హాకీకేది: ప్రబోధ్ టర్కీ
హైదరాబాద్: క్రికెట్ ఇచ్చిన ప్రాధాన్యం హాకీకి ఇవ్వడం లేదని భారత హాకీ జట్టు కెప్టెన్ ప్రబోధ్ టర్కీ అన్నారు. క్రికెట్ జట్టు ట్వంటీ 20 ప్రపంచ కప్ గెలిస్తే తాము ఆసియా కప్ గెలిచామని, అయినా తమను ఎవరూ పట్టించుకోలేదని ఆయన అన్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు నుంచి 1కె రన్ ప్రారంభం సందర్భంగా గురువారం ఆయన ఆ మాటలన్నారు. క్రికెట్ కు ఇస్తున్న ప్రాధాన్యం జాతీయ క్రీడ హాకీకి ఇవ్వడం లేదని ప్రముఖ హాకీ క్రీడాకారుడు దిలీప్ టర్కీ అన్నారు.
క్రికెట్ కు దొరికినట్లు హాకీకి స్పాన్సరర్లు దొరకరని ఆయన అన్నారు. సుచిర్ ఇండియా వంటి సంస్థలు ముందుకు రావడం శుభపరిణామమని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, జి. వినోద్ 1కె రన్ ను ప్రారంభించారు. సీనియర్ హాకీ క్రీడాకారుడు ముఖేష్ కూడా ఈ రన్ లో పాల్గొన్నారు. ఈ రన్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు సాగి తిరికి పార్కుకు చేరుకుంది.
Story first published: Thursday, November 29, 2007, 23:53 [IST]
Other articles published on Nov 29, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications