
హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో జరిగే పురుషుల హాకీ వరల్డ్ కప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని బుధవారం అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) ప్రకటించింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు ఈ మెగా టోర్నీకి భారత్‌లోని భువనేశ్వర్ ఆతిథ్యమిస్తోంది.
మొత్తం 19 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో భాగంగా డిసెంబర్ 28న జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య భారత హాకీ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆ తర్వాత డిసెంబర్ 2న బెల్జియం, డిసెంబర్ 8వ తేదీన కెనడాతో తలపడనుంది. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఈ 16 జట్లుని నాలుగు గ్రూపులుగా విభజించారు.
భారత్‌తో పాటు బెల్జియం, కెనడా, దక్షిణాఫ్రికా జట్లు పూల్ సీలో ఉన్నాయి. పూల్ ఏలో రియో ఒలింపిక్స్ ఛాంపియన్ అర్జెంటీనాతో పాటు న్యూజిలాండ్, స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు ఉన్నాయి. పూల్ స్టేజిలో కొన్ని అద్భుతమైన మ్యాచ్‌లు అభిమానులను కనువిందు చేయనున్నాయి. డిసెంబర్ 1న మాజీ వరల్డ్ ఛాంపియన్లు జర్మనీ, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
డిసెంబర్ 4వ తేదీన ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక, పూల్ బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, చైనా జట్లు ఉన్నాయి. పూల్ డీలో నెదర్లాండ్స్, జర్మనీ, మలేసియా, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. టోర్నీలో భాగంగా పూల్ స్టేజి నవంబర్ 28 నుంచి డిసెంబర్ 9వరకు జరగనుంది.
ఆ తర్వాత డిసెంబర్ 12-13 తేదీల్లో క్వార్టర్ ఫైనల్స్ జరగనుండగా... సెమీ పైనల్స్ డిసెంబర్ 15న జరగనుంది. ఇక, ఫైనల్స్ పోరు డిసెంబర్ 16న జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ కూడా భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరుగుతాయి. ఈ స్టేడియం కెపాసిటీ 16,000.
Odisha Hockey Men's World Cup Bhubaneswar 2018 - Pools
Pool A: Argentina, New Zealand, Spain, France
Pool B: Australia, England, Ireland, China
Pool C: Belgium, India, Canada, South Africa
Pool D: Netherlands, Germany, Malaysia, Pakistan
Schedule:
Pool phase: Nov. 28 to Dec. 9 (Two matches everyday. 1st match at 5:00pm IST & 2nd match at 7:00pm IST)
Cross-over match (to qualify for quarters): Dec. 10-11
Quarter-finals: Dec. 12-13
Semi-finals: Dec. 15
Bronze Medal: Dec. 16
Final: Dec. 16
Source: FIH Release