Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hockey World Cup: చెన్నైలో హాకీ వరల్డ్ కప్.. భారత్-పాక్ మ్యాచ్‌కు రంగం సిద్ధం

Hockey World Cup: అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో పురుషుల జూనియర్ ప్రపంచ కప్ భారత్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్ తమిళనాడులో నిర్వహించబడుతుంది. ఈ సారి ఈ టోర్నమెంట్‌లో 24 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో పాకిస్థాన్ జట్టు కూడా ఉంది. ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు భారత్‌కు రావచ్చు. ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల జట్లు క్రీడా మైదానంలో ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి. అంతే కాకుండా ఈ టోర్నమెంట్ కోసం భారత్-పాకిస్థాన్‌లను ఒకే పూల్‌లో ఉంచారు. హాకీ పురుషుల జూనియర్ ప్రపంచకప్ కోసం మొత్తం 24 జట్లను 6 పూల్స్‌లో ఉంచారు. దీంతో మరోసారి అభిమానులు క్రీడా మైదానంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరును చూడవచ్చు.

హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్‌కు 6 పూల్స్ ఇలా..

*పూల్ ఏ: దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, కెనడా, జర్మనీ

*పూల్ బీ: భారత్, పాకిస్థాన్, స్విట్జర్లాండ్, చిలీ

*పూల్ సి: న్యూజిలాండ్, జపాన్, చైనా, అర్జెంటీనా

*పూల్ డి: నమీబియా, స్పెయిన్, ఈజిప్ట్, బెల్జియం

*పూల్ ఇ: ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, మలేషియా

*పూల్ ఎఫ్: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, కొరియా

Hockey Junior World Cup 2025 India vs Pakistan Set for Clash in Chennai

టోర్నమెంట్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు?
అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్ 2025 భారత్‌లో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు జరుగుతుంది.

గత సీజన్ విజేత ఈ జట్టే..
గత సారి హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్‌ను జర్మనీ గెలుచుకుంది. ఫైనల్‌లో జర్మనీ ఫ్రాన్స్‌ను 2-1 తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ ఏమన్నారంటే?
ఈ సందర్భంగా హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలా నాథ్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ రోజు హాకీ ప్రపంచానికి ఒక చారిత్రాత్మక క్షణం, ఎందుకంటే మేము 24 దేశాలు పాల్గొనే మొదటి అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ కోసం పూల్ డ్రాను చూస్తున్నాము. హాకీ ఇండియా తరపున దేశవ్యాప్తంగా హాకీ క్రీడాకారులకు వారి దృఢమైన మద్దతుకు ప్రధాని నరేంద్ర మోడీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను." అని అన్నారు.

Story first published: Sunday, June 29, 2025, 11:12 [IST]
Other articles published on Jun 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+