Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

20 ఏళ్ల తర్వాత ఫైనల్లోకి: హాకీలో భారత మహిళల జట్టు చరిత్ర

Hockey: Indian women make 1st Asian Games final in 20 years thanks to Gurjit Kaur strike vs China

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత హాకీ అమ్మాయిలు అదరగొట్టారు. 20 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు చేరుకుంది. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న భారక హాకీ అమ్మాయిల జట్టు అదేజోరులో ఫైనల్‌కు దూసుకెళ్లారు.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

బుధవారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో 1-0 గోల్స్‌ తేడాతో మూడుసార్లు చాంపియన్‌ చైనాను ఓడించి 20 ఏళ్ల తర్వాత తొలిసారి టైటిల్‌పోరులో నిలిచారు. భారత్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను గుర్జీత్‌ కౌర్‌ సాధించింది. 52వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను ఆమె సద్వినియోగం చేసింది.

దీంతో గ్రూప్‌ 'బి'లో అజేయంగా అగ్రస్థానంతో సెమీస్‌ చేరిన రాణి రాంపాల్‌ బృందం ఫైనల్లోకి ప్రవేశించింది. భారత్‌ ఫైనల్లో జపాన్‌తో తలపడుతుంది. జపాన్‌ సెమీస్‌లో 2-0తో ఐదుసార్లు విజేత దక్షిణ కొరియాకు షాకిచ్చింది. గత 20 ఏళ్లలో భారత మహిళల జట్టు ఆసియా క్రీడల ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి.

ఆసియా గేమ్స్‌లో మహిళల హాకీ ప్రవేశపెట్టిన 1982 క్రీడల్లో విజేతగా నిలిచిన భారత్‌.. ఆ తర్వాత మరెప్పుడూ టైటిల్‌ నెగ్గలేకపోయింది. చివరిసారిగా భారత మహిళల హాకీ జట్టు 1998 బ్యాంకాక్‌ క్రీడల్లో ఫైనల్‌ చేరినా.. అప్పట్లో రన్నరప్‌తోనే సరిపెట్టుకొంది. ఆ తర్వాత ఇప్పుడే తుదిపోరులో నిలిచింది.

నేడు పురుషుల హాకీ సెమీఫైనల్‌
డిఫెండింగ్‌ చాంపియన్‌‌గా ఈ ఆసియా గేమ్స్ బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు నేడు సెమీఫైనల్‌ ఆడనుంది. పూల్‌ 'ఎ'లో అజేయంగా అగ్రస్థానంతో సెమీస్‌ చేరిన భారత్‌... పూల్‌ 'బి'లో రెండో స్థానంలో నిలిచిన మలేసియాతో అమీతుమీ తేల్చుకోనుంది.

టోర్నీ ఆరంభం నుంచి అటాకింగ్‌ గేమ్‌ ఆడుతున్న భారత పురుషుల జట్టు ఈ మ్యాచ్‌లోనూ అదే దూకుడుగా ఆడి పైనల్స్‌కు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది. హాకీ చరిత్రలో ఓ టోర్నీలో అత్యధిక గోల్స్‌(76) కొట్టిన ఘనతను భారత జట్టు ఈ ఆసియా గేమ్స్‌లో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Thursday, August 30, 2018, 9:00 [IST]
Other articles published on Aug 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+