పాక్‌తో పోరుకు భారత్ జట్టు

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. జూన్ 23 నుంచి జూలై 1 వరకు నెదర్లాండ్స్‌లోని బ్రిడాలో ఈ టోర్నీ జరగనుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ పోటీపడనున్నాయి.
ఆరు దేశాలు పాల్గొంటున్న టోర్నీ షెడ్యూల్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య విడుదల చేసింది. జూన్ 23న పాక్‌తో మ్యా చ్ తర్వాత 24న అర్జెంటీనాతో, 27న ఆస్ట్రేలియాతో, 28న బెల్జియంతో భారత్ ఆడనుంది.
టోర్నీ తొలి రోజు భారత్-పాక్ మ్యాచ్‌తో పాటు నెదర్లాండ్స్-అర్జెంటీనా, ఆస్ట్రేలియా-బెల్జియం తలపడనున్నాయి. నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధించగా.. భారత్, పాకిస్థాన్, బెల్జియం జట్లను ఎఫ్‌ఐహెచ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రతిపాదించింది.
నవంబరు 28 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ కప్‌కు ముందు జరుగుతున్న అతి పెద్ద టోర్నీ ఇదే. సంవత్సరాంతంలో ప్రతి జట్టుకు మరో జట్టుతో తలపడేందుకు ఉన్న ఆఖరి అవకాశం కానుండటం విశేషం. కాగా, ప్రపంచ కప్ నవంబరు 28 నుంచి డిసెంబరు 16వరకు జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications