న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కెప్టెన్‌గా మన్‌ప్రీత్‌: వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత హాకీ జట్టు ఇదే

Hockey India names 18-member team for the 2018 Odisha Hockey Men’s World Cup

హైదరాబాద్: స్వదేశంలో జరిగే వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత హాకీ జట్టును గురువారం హాకీ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. మొత్తం 18 మందితో కూడిన భారత జట్టుకు మన్‌ప్రీత్‌ సింగ్‌ కెప్టెన్‌గా వహించనున్నాడు. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16వరకు హాకీ వరల్డ్‌కప్ జరగనుంది.

ఆసియా చాంపియన్‌షిప్ నుంచి మోకాలి గాయంతో తప్పుకున్న వెటరన్ ప్లేయర్ సునీల్, కాంటినెంటల్ కప్ నుంచి జట్టుకు దూరమైన రూపిందర్ పాల్ సింగ్‌లకు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్, పాకిస్థాన్‌తో కలిసి సంయుక్త విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

మిడ్‌ఫీల్డర్స్‌గా సుమిత్, నీలకంఠ శర్మ

మిడ్‌ఫీల్డర్స్‌గా యువ ఆటగాళ్లు సుమిత్, నీలకంఠ శర్మ, హార్ధిక్ సింగ్‌లతోపాటు సీనియర్ చింగ్లేన్‌సానా ఎంపికయ్యాడు. ఇక ఫార్వర్డ్ విభాగంలో భారత్ అనుభవజ్ఞులతో కూడిన లైనప్‌ను ఎంచుకుంది. ఆకాశ్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయతోపాటు జూనియర్ ప్రపంచకప్ గెలిచిన మన్‌దీప్ సింగ్, సిమ్రన్‌జిత్ సింగ్ ఫార్వర్డ్స్‌గా ఆడనున్నారు.

పూల్‌ ‘సి'లో భారత్, బెల్జియం, కెనడా, దక్షిణాఫ్రికా

పూల్‌ ‘సి'లో భారత్, బెల్జియం, కెనడా, దక్షిణాఫ్రికా

ప్రపంచ మూడో ర్యాంకర్‌ బెల్జియం, కెనడా, దక్షిణాఫ్రికాలతో కలిసి భారత్‌ పూల్‌ ‘సి'లో భారత్ గ్రూప్ మ్యాచ్‌లలో తలపడనుంది. జట్టు ఎంపికపై భారత హాకీ జట్టు కోచ్ హరీంద్ర సింగ్ మాట్లాడుతూ "34 మంది ప్రాబబుల్స్ జాబితా నుంచి అర్హులైన 18 మంది జట్టును ఎంపిక చేసేందుకు కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకున్నాం. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల నుంచి అద్భుతమైన మేళవింపుతో కూడిన జట్టును ప్రకటించాం" అని అన్నాడు.

14వ హాకీ వరల్డ్ కప్‌కు సర్వం సిద్ధం

14వ హాకీ వరల్డ్ కప్‌కు సర్వం సిద్ధం

14వ హాకీ వరల్డ్ కప్‌కు సర్వం సిద్ధమైంది. నవంబర్‌లో జరగనున్న హాకీ వరల్డ్ కప్‌కు భువనేశ్వర్‌లోని కలింగ అంతర్జాతీయ హాకీ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఈ టోర్నీలో మొత్తం 16 దేశాలు పాల్గొనున్నాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు డిపెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగబోతోంది. టోర్నీలో పాల్గొనే మొత్తం 16 జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు.

 డిసెంబర్ 9 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు

డిసెంబర్ 9 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు

అన్ని జట్లు కూడా గ్రూప్ స్టేజిలో మూడు మ్యాచ్‌లు ఆడతాయి. డిసెంబర్ 9 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. మరోవైపు ఈ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు పాల్గొనడం సందేహంగా మారింది. అర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్‌ హాకీ సమాఖ్య డబ్బు కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)ను సంప్రదించగా పీసీబీ నిరాకరించడం విశేషం.

 హాకీ వరల్డ్ కప్‌కు భారత జట్టు:

హాకీ వరల్డ్ కప్‌కు భారత జట్టు:

గోల్‌కీపర్లు: పీఆర్ శ్రీజేశ్, క్రిషన్ బహదూర్ పాఠక్

డిఫెండర్లు: హర్మన్‌ప్రీత్ సింగ్, బీరేంద్ర లాక్రా, వరుణ్ కుమార్, కోతాజిత్ సింగ్, ఖడాంగ్‌బమ్, సురేంద్ర కుమార్, అమిత్

మిడ్‌ఫీల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), చింగ్లేన్‌సానా(వైస్ కెప్టెన్), నీలకంఠశర్మ, హార్ధిక్ సింగ్, సుమిత్

ఫార్వర్డ్స్: ఆకాశ్‌దీప్ సింగ్, మన్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, లలిత్‌కుమార్ ఉపాధ్యాయ, సిమ్రన్‌జీత్ సింగ్.

Story first published: Friday, November 9, 2018, 13:56 [IST]
Other articles published on Nov 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X