బ్రిటన్‌పై గెలుపు, రెండవ సారి విజేతగా భారత్(ఫోటోలు)
న్యూఢిల్లీ: సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్ అండర్ - 21 హాకీ టోర్నీలో భారత జట్టు విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ మరోసారి టైటిల్‌ని నిలబెట్టుకుంది. సెమీఫైనల్లో హ్యాట్రిక్ సాధించిన హర్మన్ ప్రీత్ ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో డబుల్ గోల్స్‌తో మెరవడంతో 2-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. 45వ నిమిషంలో లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకున్న హర్మన్ ప్రీత్ బంతిని నెట్‌కు చేర్చి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
ఈమ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌తో భారత్ తలపడింది. హర్మన్ ప్రీత్ 45, 90 నిమిషాల్లో గోల్స్ కొట్టి ఫైనల్‌లో హీరోగా నిలిచాడు. 53వ నిమిషంలో లభించిన పెనాల్టీతో భారత ఆధిక్యం 2-0కు పెరిగే అవకాశం వచ్చినా, దాన్ని వరుణ్ కుమార్ ఉపయోగించుకోలేకపోయాడు. వైడ్ కొట్టి నిరాశ పరిచాడు.
ఆ తర్వాత మరో రెండు నిమిషాల్లోనే భారత ఆధిక్యం 1-1కి పడిపోయింది. 55వ నిమిషంలో బ్రిటన్ తరుపున శామ్యూల్ ఫ్రెంచ్ సాధించాడు. దీంతో బ్రటిన్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత గెలుపు కోసం రెండు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి.
90వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌కే మరో పెనాల్టీ లభించడంతో ఎలాంటి తప్పిదానికి తావు లేకుండా అతను మరో గోల్ సాధించి భారత్‌ను విజేతగా నిలబెట్టాడు. దీంతో 2011లో ఈ టోర్నీ ప్రారంభమైన తర్వాత రెండు టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. 2011లో మలేసియా విజేతకాగా, 2012లో జర్మనీ విజేతగా నిలిచింది. 2013లో భారత్ టైటిల్ నెగ్గింది.
దీంతో రెండవ స్దానంలో గ్రేట్ బ్రిటన్ నిలవగా మూడవ స్దానం కోసం జరిగిన పోటీలో ఆస్ట్రేలియా 6-2తో న్యూజిలాండ్‌పై గెలుపొందింది.

బ్రిటన్‌పై గెలుపు, రెండవ సారి విజేతగా భారత్
సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్ అండర్ - 21 హాకీ టోర్నీలో భారత జట్టు విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ మరోసారి టైటిల్‌ని నిలబెట్టుకుంది. సెమీఫైనల్లో హ్యాట్రిక్ సాధించిన హర్మన్ ప్రీత్ ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో డబుల్ గోల్స్‌తో మెరవడంతో 2-1 గోల్స్ తేడాతో గెలుపొందింది.

బ్రిటన్‌పై గెలుపు, రెండవ సారి విజేతగా భారత్
ఈమ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌తో భారత్ తలపడింది. హర్మన్ ప్రీత్ 45, 90 నిమిషాల్లో గోల్స్ కొట్టి ఫైనల్‌లో హీరోగా నిలిచాడు. 53వ నిమిషంలో లభించిన పెనాల్టీతో భారత ఆధిక్యం 2-0కు పెరిగే అవకాశం వచ్చినా, దాన్ని వరుణ్ కుమార్ ఉపయోగించుకోలేకపోయాడు. వైడ్ కొట్టి నిరాశ పరిచాడు.

బ్రిటన్‌పై గెలుపు, రెండవ సారి విజేతగా భారత్
90వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌కే మరో పెనాల్టీ లభించడంతో ఎలాంటి తప్పిదానికి తావు లేకుండా అతను మరో గోల్ సాధించి భారత్‌ను విజేతగా నిలబెట్టాడు. దీంతో 2011లో ఈ టోర్నీ ప్రారంభమైన తర్వాత రెండు టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.

బ్రిటన్‌పై గెలుపు, రెండవ సారి విజేతగా భారత్
2013లో భారత్ టైటిల్ నెగ్గింది. దీంతో రెండవ స్దానంలో గ్రేట్ బ్రిటన్ నిలవగా మూడవ స్దానం కోసం జరిగిన పోటీలో ఆస్ట్రేలియా 6-2తో న్యూజిలాండ్‌పై గెలుపొందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications