Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆఫర్ అదిరింది: ఫైనల్‌లో గెలిస్తే తలో 5లక్షలు

హైదరాబాద్: జూనియర్‌ హాకీ ప్రపంచక్‌పలో ఫైనల్‌కు చేరుకొన్న భారత హాకీ జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. శుక్రవారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ స్టేడియంలో కిక్కిరిసిన అభిమానుల సమక్షంలో జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియాపై షూటౌట్‌లో 4-2తో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Hockey india announces cash prize of Rs 5 lakhs for a Player.

భారత్‌ చివరిసారి 2001లో జూనియర్ హాకీ ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించింది. 2013లో స్వదేశంలోనే జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగింది. 15 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్‌ జట్టుని హాకీ సమాఖ్య అభినందించింది.

సెమీస్‌లో షూటౌట్‌: ఆసీస్‌పై విజయం, ఫైనల్లో భారత్‌

అంతేకాదు ఫైనల్స్‌లో భారత జట్టు ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంటే ఆటగాళ్లకు తలో రూ.5 లక్షలు, సహాయ సిబ్బందికి రూ.2 లక్షలు చొప్పున క్యాష్ ప్రైజ్ అందజేస్తామని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. దీంతో పైనల్స్‌కు అర్హత సాధించిన కుర్రాళ్లు తమకు ఏ పతకం కావాలో వారే నిర్ణయించుకోవాలని ప్రధాన కోచ్‌ హరేంద్రసింగ్‌ అన్నారు.

మరోవైపు మొట్టమొదటిసారి టోర్నీలో ఫైనల్స్‌కు చేరుకున్న బెల్జియం ఆటగాళ్లపై సత్తా చూపాలని సూచించాడు. సెమీస్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా గొప్పగా పోరాడిందని, అయితే షూటౌట్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడాడు. ఆదివారం జరిగే ఫైనల్లో బెల్జియంతో భారత్‌ తలపడనుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:16 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+