భారత పురుషుల హాకీ జట్టు కోచ్‌గా గ్రాహం రీడ్!

హైదరాబాద్: భారత పురుషుల హాకీ జట్టు కోచ్‌గా గ్రహం రీడ్ (ఆస్ట్రేలియా)ను నియమించేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం జరిగిన హాకీ ఇండియా, సాయ్ అధికారు ల సమావేశంలో ఈమేరకు కోచ్‌గా రీడ్‌ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోచ్‌గా అతడి ఆమోదం కోసం రీడ్ పేరును కేంద్ర క్రీడాశాఖకు పంపారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
2022 వరల్డ్‌కప్ వరకు అతను ఈ పదవిలో కొనసాగే అవకాశాలున్నాయి. కోచ్‌గా ఎంపిక చేసినప్పటికీ ప్రతీ టోర్నమెంట్ అనంతరం రీడ్ పనితీరును హాకీ ఇండియా హైపవర్ కమిటీ అంచనా వేయనుంది. దాని ఆధారంగానే ఒప్పందం కొనసాగనుంది. ఈ ఏడాది జనవరిలో హరేంద్ర సింగ్‌ను తొలగించిన తర్వాత కోచ్ పదవికి మళ్లీ ఎవర్ని ఎంపిక చేయలేదు.
ఆస్ట్రేలియాకే చెందిన మరో మాజీ హాక్ ప్లేయర్ జే స్టాసీని పేరును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ... చివరకు గ్రాహం రీడ్ వైపే కమిటీ మొగ్గు చూపింది. రీడ్ ఎంపికపై కేంద్ర క్రీడాశాఖ ఆమోదం తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన ఆసీస్ జట్టులో రీడ్ సభ్యుడిగా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications