
సాయ్ సెంటర్ కేంద్రంగా పని చేయనున్నారు:
ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో భారత్ పరాజయం పాలైంది. దీంతో అప్పటి కోచ్ హరేంద్ర సింగ్‌ను ఉన్నపలంగా తప్పించారు. ఇక మర్చిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) భారత కోచ్‌గా గ్రాహం రీడ్ పేరును సిఫారసు చేయడంతో.. రీడ్ కోచ్‌గా బాధ్యతలు చేపెట్టనున్నారు. బెంగళూరు సాయ్ సెంటర్ కేంద్రంగా రీడ్ పని చేయనున్నారు. అయితే ఈయన ఆధ్వర్యంలో భారత హాకీ జట్టు మంచి ఫలితాలు సాధిస్తే.. రీడ్ కాంట్రాక్ట్‌ను 2022 ప్రపంచ కప్ వరకు కొనసాగించే అవకాశం ఉంది.

కోచ్‌గా ఎంపిక కావడం గొప్ప గౌరవం:
గ్రాహం రీడ్ మాట్లాడుతూ... 'భారత హాకీ జట్టు కోచ్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. భారత హాకీని దగ్గరి నుంచి చూశాను. ఒలింపిక్స్, వరల్డ్ కప్‌లకంటే ముందు జరగనున్న టోర్నీలపైనే దృష్టి పెడతా. భారత హాకీ కోచ్‌గా రాణిస్తాననే నమ్మకం ఉంది' అని ఆశాభావం వ్యక్తం చేశారు.

130 మ్యాచ్‌లు.. 36 గోల్స్:
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన గ్రాహం రీడ్ డిఫెండర్, మిడ్‌ఫీల్డర్‌గా ఆసీస్ జట్టుకు సేవలందించారు. 130 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 36 గోల్స్ చేశారు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులో, నాలుగు సార్లు చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యుడుగా ఉన్నారు. 2009లో కోచింగ్‌లో అడుగు పెట్టిన రీడ్.. 2014-16లో ఆస్ట్రేలియా జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. 2017-2019లో నెదర్లాండ్స్ టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు. అనంతరం భారత పురుషుల హాకీ జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యారు.


Click it and Unblock the Notifications












