Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హాకీ ఆటగాళ్ల మృతి!!

Four national level hockey players died in car accident

హోషంగాబాద్‌ (మధ్యప్రదేశ్‌): రోడ్డు ప్రమాదంలో నలుగురు జాతీయ స్థాయి హాకీ ఆటగాళ్లు మృతి చెందారు. సోమవారం ఉదయం మధ్యప్రదేశ్‌ రాష్ట్రం హోషంగాబాద్‌లోని రాయిసల్‌పూర్‌ వద్ద జరిగిన కారు ప్రమాదంలో నలుగురు హాకీ ఆటగాళ్లు మృతి చెందడంతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి-69పై హాకీ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది.

ఆటగాళ్లు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారి అతివేగంగా వెళుతుండంతో.. ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు హాకీ ఆటగాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. కారులోని మరో ముగ్గురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. 'ధ్యాన్‌చంద్‌ ట్రోఫీ'లో పాల్గొనేందుకు హాకీ ఆటగాళ్లు ఇటార్సీ నుంచి హోషంగాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

విషయం తెలుసుకున్న హోషంగాబాద్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతిచెందిన ఆటగాళ్లను ఇంకా గుర్తించలేదు. 'అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం. దర్యాప్తు చేస్తున్నాం. ఆటగాళ్ల వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని పోలీసులు తెలిపారు.

Story first published: Monday, October 14, 2019, 12:17 [IST]
Other articles published on Oct 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+