Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హాకీలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం

Four-nation hockey: India beat New Zealand 3-2 in opener

హైదరాబాద్: నాలుగు దేశాల హాకీ టోర్నీ పోటీలను భారత జట్టు విజయంతో మొదలుపెట్టింది. రెండో విడతగా జరుగుతున్న ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. బుధవారం సాగిన మ్యాచ్‌లో భారత్‌ 3-2 తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.

భారత్‌ తరపున లలిత్‌ ఉపాధ్యాయ్‌ (7వ నిమిషంలో), హర్జీత్‌ సింగ్‌ (32వ నిమిషంలో), రూపిందర్‌ పాల్‌ సింగ్‌ (36వ నిమిషంలో) గోల్స్‌ చేశారు. న్యూజిలాండ్‌ జట్టులో డానియల్‌ హారిస్‌ (23వ నిమిషంలో), కేన్‌ రస్సెల్‌ (37వ నిమిషంలో) గోల్స్‌ చేశారు.

మన్‌ప్రీత్ సింగ్ విజయంలో కీలక పాత్ర వహించాడు. భారత జట్టుకు మొదటి పెనాల్టీని మన్‌దీప్ సింగ్ తీసుకొచ్చాడు. 32వ నిమిషం వరకు ఒక్క పెనాల్టీ కూడా లేని భారత్‌కు దాంతో గేమ్ తిరిగిపోయింది.

భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో బెల్జియంతో తలపడనుంది. తొలి అంచె ఫైనల్లో బెల్జియం చేతిలోనే భారత్‌ పరాజయం పాలైంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 25, 2018, 13:35 [IST]
Other articles published on Jan 25, 2018
Read in English: India beat Belgium 5-4
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+