
అంతర్జాతీయ హాకీ నుంచి రిటైర్ అవ్వాలని:
యువకులకు అవకాశమిచ్చేందుకు తానీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. ‘అవును. అంతర్జాతీయ హాకీ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. నా కెరీర్‌లో సరిపడా హాకీ ఆడా. 12 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేశా. భవిష్యత్ తరాలకు అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయం. నా కుటుంబం, మిత్రులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నా' అని సర్దార్ సింగ్ తెలిపాడు.

సర్దార్.. శుక్రవారం ఢిల్లీలో రిటైర్మైంట్‌ను :
ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన హాకీ జట్టులో సర్దార్ సభ్యుడు. ఆ సమయంలో తనలో ఇంకా ఆట ఉందని చివరిగా 2020 ఒలింపిక్స్‌లో కూడా పాల్గొంటానని చెప్పడం విశేషం. అయితే జాతీయ శిక్షణ శిబిరం కోసం బుధవారం హాకీ ఇండియా ప్రకటించిన 25 మంది సభ్యుల జాబితాలో సర్దార్ పేరు లేదు. దీంతో సర్దార్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం అడిగితే సమాధానం చెప్పడానికి నిరాకరించిన సర్దార్.. శుక్రవారం ఢిల్లీలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తన రిటైర్మైంట్‌ను అధికారికంగా ప్రకటిస్తానని చెప్పాడు.

2008 నుంచి 2016 వరకు 350కి పైగా:
2006లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సీనియర్ జట్టులో అడుగుపెట్టిన సర్దార్.. అప్పటి నుంచి జట్టు మిడ్‌ఫీల్డ్ విభాగంలో కీలక ఆటగాడిగా మారాడు. 32ఏళ్ల సర్దార్ భారత్ తరపున 350కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లాడాడు. 2008 నుంచి 2016 వరకు జట్టుకు నాయకత్వం చేపట్టాడు. దాంతోపాటు భారత జట్టు బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్సు ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు.

బ్రిటీష్ మహిళను అత్యాచారం చేశాడనే ఆరోపణలు
రెండు ఒలింపిక్స్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన సర్దార్.. 2012లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. సర్దార్ తనదైన ఆటతో భారత హాకీలో ప్రత్యేక ముద్ర వేశాడు. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల భారత జట్టులో చోటు కోల్పోయిన అతను ఆ తర్వాత గొప్పగా పుంజుకొని తిరిగి ఆసియా క్రీడల జట్టులోకి ఎంపికయ్యాడు. గొప్పగా సాగిన అతని కెరీర్‌లో ఓ వివాదం కూడా ఉంది. భారత సంతతికి చెందిన బ్రిటీష్ మహిళను అత్యాచారం చేశాడనే ఆరోపణలు అతని మీద వచ్చాయి. అయితే పోలీసు విచారణలో అతడికి క్లీన్‌చీట్ లభించింది.


Click it and Unblock the Notifications
