
హైదరాబాద్: మహిళల హాకీ వరల్డ్ కప్‌కు సర్వం సిద్ధమైంది. జులై 21 నుంచి జరిగే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిధ్యం ఇవ్వనుంది. మొత్తంగా 16 జట్లు ఈ వరల్డ్ కప్‌లో పాల్గొంటున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో పూల్ బిలో భారత్ జట్టు ఉంది. టోర్నీలో భాగంగా భారత భారత మహిళల హాకీ జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
18 మంది సభ్యుల భారత జట్టుకు ఫార్వర్డ్ ప్లేయర్ రాణి రాంపాల్‌ను కెప్టెన్‌గా వ్వవహారించనుంది. ఈ వరల్డ్ కప్‌కు ముందు భారత మహిళల జట్టు బాగానే సన్నాహాకమైంది. ఇటీవల స్పెయిన్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-2తో సమం చేసుకుంది. గ్రూప్-బిలో భారత్‌తో పాటు ఆతిథ్య ప్రపంచ 2వ ర్యాంక్ ఇంగ్లండ్, 7వ ర్యాంక్ యూఎస్‌ఏ, 16వ ర్యాంక్ ఐర్లాండ్ జట్లు ఉన్నాయి.
నాలుగు గ్రూపుల నుంచి అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. హాకీ వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు అత్యుత్తమ ప్రదర్శన నాలుగో స్థానానికే పరిమితమైంది. 1974లో జరిగిన వరల్డ్ కప్‌లో వెస్ట్ జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 0-2తో ఓటమి పాలై కాంస్య పతకాన్ని తృటిలో చేజార్చుకుంది.
ఈ వరల్డ్ కప్‌లో మరో ఆసక్తికర విషయం ఏంటంటే 18మంది జట్టు సభ్యుల్లో 16 మంది తొలిసారి అరంగేట్రం చేస్తున్నారు. ప్రస్తుత జట్టులో కెప్టెన్ రాణి రాంపాల్, సీనియర్ క్రీడాకారిణి దీపకలకిు మాత్రమే గత వరల్డ్ కప్‌లో ఆడిన అనుభవం ఉంది. ఈ వరల్డ్ కప్‌ను నెదర్లాండ్స్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. నెదర్లాండ్స్ ఇప్పటివరకు ఏడు సార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.
వరల్డ్‌కప్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు:
తేదీలు: July 21 to August 5
వేదికలు: Lee Valley Hockey & Tennis Centre, London
టొర్నీలో పాల్గానే మొత్తం జట్లు: 16
గ్రూప్‌లు
గ్రూప్ A: China, Italy, Korea, Netherlands
గ్రూప్ B: England, India, Ireland, USA
గ్రూప్ C: Argentina, Germany, South Africa, Spain
గ్రూప్ D: Australia, Belgium, Japan, New Zealand
వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు షెడ్యూల్:
July 21 - India vs England - 18:30
July 26 - India vs Ireland - 18:30
July 29 - India vs USA - 21:30
CROSSOVER MATCHES (IST)
July 30 - 22:30 & 00:45 (next day)
July 31 - 22:30 & 00:45 (next day)
QUARTERFINALS (IST)
August 1 - 22:30 & 00:45 (next day)
August 2 - 22:30 & 00:45 (next day)
SEMIFINALS (IST)
August 4 - 18:30 & 21:00
MEDAL MATCHES (IST)
August 5
Bronze (3rd place) - 18:30
Gold (Final) - 21:00
హాకీ వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత మహిళా జట్టు:
గోల్ కీపర్లు: సవిత (వైస్ కెప్టెన్), రజని ఎతిమార్పు. ఢిఫెండర్లు సునీ తలక్రా, దీప్‌గ్రేస్ ఎక్కా, దీపిక, గుర్జీత్ కౌర్, రీనా ఖొకర్.
మిడ్ ఫీల్డర్లు: నమిత టోప్పో, లీలిమా మింజ్, మోనికా, నేహా గోయాల్, నవజోత్ కౌర్, నిక్కి ప్రధాన్.
ఫార్వర్డ్స్: రాణిరాంపాల్ (కెప్టన్), వందన కార్తీకేయ, నవనీత్ కౌర్, లాల్‌రేమ్ సియామి, ఉదిత.