Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రియుడి హత్య: మనస్థాపంతో హాకీ ప్లేయర్ ఆత్మహత్య

Vishakapatnam
విశాఖపట్నం: జిల్లాలోని తాటిచెట్లపాలెంలో మీనా అనే హాకీ క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల క్రితం ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో జరిగిన గొడవలో స్థానిక హాకీ కోచ్ కమ్ క్రీడాకారుడు భాస్కర రావు హత్యకు గురైన విషయం తెలిసిందే. భాస్కర రావు మృతితో మనస్థాపం చెందిన మీనా మంగళవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. మీనా డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఈమెకు భాస్కర రావు గురువు. భాస్కర రావుతో మీనాకు ఏడేళ్లుగా పరిచయం ఉంది. ఆయన వద్దే హాకీ నేర్చుకుంది.

భాస్కర రావు హత్య తర్వాత రెండు రోజులుగా మీనా కళాశాలకు వెళ్లడం లేదు. మంగళవారం కూడా తాను వెళ్లనని చెప్పి ఇంట్లోనే ఉండిపోయింది. భాస్కర రావు, మీనా మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏడేళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారని సమాచారం. దీంతో అతని మృతిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే మీనా బంధువులు మాత్రం ఇద్దరు మంచి స్నేహితులు మాత్రమే అని చెబుతున్నారు. కాగా ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న రాత్రి సమయంలో భాస్కర రావుకు జూనియర్ హాకీ క్రీడాకారుడితో స్వల్ప ఘర్ణ జరిగింది. ఆ జూనియర్ క్రీడాకారుడు ఆగ్రహంతో కేక్ కట్ చేసేందుకు తెచ్చిన కత్తితో భాస్కర రావు కడపులో పొడిచాడు. హాస్పిటల్ తరలించేలోగానే అతను మృతి చెందాడు.
Story first published: Wednesday, November 15, 2017, 12:24 [IST]
Other articles published on Nov 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+