న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియా తొండాట: భారత్‌కు పతకం దూరం: ప్లేయర్ల కన్నీటిపర్యంతం

CWG 2022 Womens hockey: Australia beat India in a controversial penalty shootout

బర్మింగ్‌హామ్: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా సాగుతోన్న కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో భారత్ అంచనాలకు మించి రాణిస్తోంది. పతకాల పంట పండిస్తోంది. పతకాల పట్టికలో తొలి అయిదు స్థానంలో నిలిచిందంటే భారత క్రీడాకారుల దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా అన్ని ఈవెంట్లల్లోనూ మెడల్స్ కొల్లగొట్టేస్తోంది. వెయిట్ లిఫ్టింగ్‌, బాక్సింగ్, రెజ్లింగ్‌లల్లో పతకాలు అందాయి. ఇప్పటివరకు 26 మెడల్స్‌లను భారత్ తన ఖాతాలో వేసుకుంది.

అనూహ్యంగా ఓటమి..

హాకీలోనూ భారత మహిళా జట్టుకు తిరుగు ఉండదని భావించినప్పటికీ.. అనూహ్య పరిణామాలు వెంటాడాయి. ఫైనల్స్‌కు చేరే అవకాశాన్ని దూరం చేశాయి. ఫైనల్స్‌కు చేరివుంటే పసిడి లేదా వెండి పతకం ఖాయం అయ్యేది. ఇప్పుడా అవకాశం లేదు. సెమీ ఫైనల్స్‌లో గెలిస్తే రజతంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. భారత్‌ను ఓడించి ఫైనల్స్‌లో అడుగు పెట్టిన ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంది. రెండో సెమీఫైనల్స్‌లో భారత్.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది. రజత పతకాన్ని ఖాయం చేసే మ్యాచ్ ఇది.

అంపైరింగ్..

కాగా- సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియా విమెన్స్ హామీ ఆడిన తీరు.. అంపైరింగ్ వ్యవహారం.. తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. పెనాల్టీ షూటౌట్‌లో అంపైర్లు తీసుకున్న నిర్ణయమే భారత జట్టు ఓటమికి కారణమైందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. #cheating అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆస్ట్రేలియా ప్లేయర్లు తొండాట ఆడారని, దానికి అంపైర్లు వత్తాసు పలుకుతున్నారంటూ నెటిజన్లు ఆరోపిస్తోన్నారు.

టైమర్ పనిచేయట్లేదట..

సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా పెనాల్టీ షూటౌట్‌లో 3-0 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించింది. మ్యాచ్ 16వ నిమిషంలో ఆస్ట్రేలియా అటాకింగ్ ప్లేయర్ రెబెక్కా గ్రేనియర్ తొలి గోల్ సాధించారు. 49వ నిమిషంలో స్టార్ స్ట్రైకర్ వందన కటారియా గోల్ సాధించింది. 1-1తో స్కోర్‌ను సమం చేసింది. చివరి నిమిషంలో ఆస్ట్రేలియా రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మార్చడానికి చేసిన ప్రయత్నాలను టీమిండియా ప్లేయర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. దీనితో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది.

భారత్ విఫలం..

తొలి షూటౌట్‌ను ఆస్ట్రేలియా గోల్‌గా మలచలేకపోయింది. బంతిని నెట్స్‌లోని నెట్టడంలో స్ట్రైకర్ అంబ్రోసియా మలోనె తడబడింది. ఆ బంతిని గోల్ కీపర్ సవిత పునియా సమర్థవంతంగా అడ్డుకుంది. టైమర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయనే కారణంతో రెఫరీ రీటేక్‌కు అవకాశం ఇచ్చాడు. అదే కొంపముంచింది. ఆస్ట్రేలియన్ డిఫెండర్ కైట్లీన్ నాబ్స్.. రెండో షూటౌట్‌ను గోల్‌గా మలచగలిగింది. భారత్ తరఫున నేహా గోయల్, నవ్‌నీత్ కౌర్ పెనాల్టీ షూటౌట్స్‌ను గోల్స్‌గా మలచలేకపోయారు.

Story first published: Monday, March 13, 2023, 20:32 [IST]
Other articles published on Mar 13, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X