Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందాల భార్య ఒలింపిక్స్‌లో..భర్త ఐపీఎల్‌లో రూ.కోట్లు సంపాదన!

పారిస్ ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. మరో మూడు రోజుల్లో విశ్వక్రీడలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అయితే ఈ మహా క్రీడా సమరంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ టిమ్ డేవిడ్ భార్య స్టెఫానీ కెర్షా కూడా బరిలోకి దిగుతోంది. అయితే భర్తలా స్టెఫానీ క్రికెటర్ కాదు. ఆస్ట్రేలియా తరఫున డేవిడ్ బ్యాటుతో పోరాడుతుంటే స్టెఫానీ హాకీ స్టిక్‌తో ప్రత్యర్థితో తలపడుతుంటుంది.

అంతేగాక టిమ్ డేవిడ్ తరహాలోనే ఆస్ట్రేలియా జట్టులో స్టెఫానీ కెర్షా కీలక సభ్యురాలు. దశాబ్ద కాలం పాటు హాకీలో ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఈ సారి పారిస్ ఒలింపిక్స్‌లో తమ జట్టుకు పతకం అందించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఆమె టోక్యో ఒలింపిక్స్‌లో కూడా పాల్గొంది. కానీ గత విశ్వక్రీడల్లో పతకం సాధించాలనే ఆమె కలను భారత్ దూరం చూసింది. భారత్‌తో జరిగిన క్వార్టర్స్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

Cricketer Tim David s Wife Stephanie Kershaw Competing in Hockey at Paris Olympics

ఈ సారి గొప్పగా సత్తాచాటి ఆస్ట్రేలియా బంగారు పతకాన్ని అందించాలని స్టెఫానీ పట్టుదలతో ఉంది. ఒలింపిక్స్‌‌లో ఆస్ట్రేలియా మహిళల హాకీ జట్టు స్వర్ణం కోసం 24 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. 2000 విశ్వక్రీడల్లోలో చివరిగా ఆసీస్ స్వర్ణం సాధించింది. ఇక టిమ్ డేవిడ్ విషయానికొస్తే.. ఈ విధ్వంసకర బ్యాటర్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పే టిమ్ డేవిడ్‌ కోసం ముంబై ఇండియన్స్ ప్రతి ఏటా రూ.8.25 కోట్లు వెచ్చిస్తుంది. కాగా, డేవిడ్‌ను తమ జట్టులోనే కొనసాగించాలని ముంబై ఫ్రాంచైజీ భావిస్తోంది. ఈ ఏడాది చివర్లో మెగా వేలం జరగనున్ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి జట్టు నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఉంటుంది. టిమ్ డేవిడ్‌ను వదులుకోవాలని ముంబై భావించట్లేదు. ఒకవేళ రిలీజ్ చేసిన రైట్ టూ మ్యాచ్ కార్డ్ ద్వారా తిరిగి తమ ఫ్రాంచైజీలోనే ఉంచుకోవాలని ముంబై ఇండియన్స్ ప్లాన్ చేస్తోంది.

Story first published: Tuesday, July 23, 2024, 12:19 [IST]
Other articles published on Jul 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+