Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్ర‌పంచ హాకీ లీగ్ ఫైన‌ల్ టోర్నీలో భార‌త్‌కు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి

Belgium to meet India in quarters

హైద‌రాబాద్‌: ప‌్ర‌పంచ హాకీ లీగ్ ఫైన‌ల్ టోర్నీ గ్రూప్ ద‌శ‌లో ఎట్ట‌కేల‌కు భార‌త్ ఫైన‌ల్‌కు చేరింది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు అజేయంగా దూసుకుపోతున్న బెల్జియం మ‌న‌కు ప్ర‌త్య‌ర్థి కావ‌డం ప్ర‌ధాన స‌మ‌స్య‌. కాగా, బుధ‌వారం భార‌త్‌-బెల్జియంల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌లో గెలిస్తేనే మ‌నం క‌ప్ గెలుచుకునే దిశ‌గా వెళ్ల‌గ‌లిగేది. లేదంటే తిరుగుప్ర‌యాణం ప‌ట్టాల్సిందే.

మంగళవారం గ్రూప్‌ దశకు తెరపడింది. దీంతో క్వార్టర్‌ఫైనల్లో ప్రత్యర్థులు ఎవరన్నది తేలింది. పూల్‌-ఎలో బెల్జియం అజేయంగా, అగ్రస్థానంతో నాకౌట్‌కు చేరింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో బెల్జియం 3-0తో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. మరోవైపు పూల్‌-బిలో భారత జట్టు ఒక డ్రా, రెండు ఓటములతో ఆఖరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను నిలువరించి టోర్నీలో శుభారంభం చేసిన మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని భారత బృందం ఆ తర్వాత ఇంగ్లాండ్‌, జర్మనీ చేతిలో పరాజయంపాలైంది. ఆసియా కప్‌ గెలిచి జోరుమీదున్న భారత జట్టు టోర్నీలో పేలవ డిఫెన్స్‌తో నిరాశపరిచింది. టోర్నీలో ఎనిమిది జట్లే ఉండటంతో గ్రూప్‌ దశలో గెలుపోటములతో సంబంధం లేకుండా అన్ని జట్లు క్వార్టర్స్‌కు చేరాయి. పూల్‌-బిలో జర్మనీ అగ్రస్థానం సాధించగా.. ఇంగ్లాండ్‌ రెండు, ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచాయి.

ముఖాముఖి రికార్డులో బెల్జియంతో ఆడిన 71 మ్యాచ్‌ల్లో భారత్ 45 గెలువగా, 17 మ్యాచ్‌ల్లో ఓడింది. 10 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. కానీ ఇటీవల ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా మూడింటిలో ఓడటం ప్రతికూలాంశం.ఫార్వర్డ్స్ మన్‌దీప్, ఆకాశ్‌దీప్, సునీల్, లలిత్ ఉపాధ్యాయ సత్తా చాటితే తిరుగుండదు. పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిస్తే భారత్‌కు తిరుగుండదు.

Story first published: Wednesday, December 6, 2017, 13:07 [IST]
Other articles published on Dec 6, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+