Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అజ్లాన్‌ షా టోర్నీ: శుక్రవారం ఓటమికి శనివారం బదులు తీర్చుకున్న భారత్

Azlan Shah Cup hockey: India break Ireland jinx to finish fifth

హైదరాబాద్: మలేసియాలోని ఇఫో వేదికగా జరుగుతోన్న 27వ అజ్లాన్‌షా హాకీ టోర్నమెంట్‌లో భారత హాకీ జట్టు ఐదో స్థానంలో సరిపెట్టుకుంది. టోర్నీలో భాగంగా శనివారం భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య ఐదు, ఆరు స్థానాల కోసం పోటీ నిర్వహించారు.

ఈ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు బదులు తీర్చుకుంది. శుక్రవారం ఐర్లాండ్ చేతిలో ఓటమిపాలై పతకం సాధించే ఆశలను సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత హాకీ ఆవిరి చేసుకున్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన అదే జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 4-1తో విజయం సాధించింది.

దీంతో శుక్రవారం నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన భారత్ ఆటగాళ్లు వరుణ్ కుమార్ (5వ ని, 32వ), షిలంద్ లక్రా (28వ ని), గుర్జంత్ సింగ్ (37వ ని)లో గోల్స్ నమోదు చేసి భారత్‌కు విజయాన్ని అందించారు.

మరోవైపు ఐర్లాండ్ తరుపున జులియన్ డేల్ (48వ ని) ఏకైక గోల్‌ని నమోదు చేశాడు. దీంతో 4-1 తేడాతో విజయం సాధించిన భారత హాకీ జట్టు ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. సర్దార్‌ సింగ్‌ కెప్టెన్సీలో భారత్‌ తొలిసారి పతకం లేకుండా వెనుదిరుగడం ఇదే తొలిసారి. అతడి కెప్టెన్సీలో గతంలో జరిగిన 2008లో రజతం, 2015, 2016లో కాంస్య, రజతాలు గెలుచుకుంది.

Story first published: Saturday, March 10, 2018, 17:44 [IST]
Other articles published on Mar 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+