
క్వార్టర్స్‌లో భారత్ మరింత దూకుడుగా
రెండో క్వార్టర్‌లో గుర్జంత్ (19వ నిమిషం) ఫీల్డ్ గోల్ చేయడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఐతే జపాన్ వెంటనే స్కోరును సమం చేసింది. ఆ తర్వాత మూడో క్వార్టర్‌లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను చింగ్లెన్‌సెనా గోల్‌గా మలిచి జట్టును 2-1 ఆధిక్యంలో నిలిపాడు. ఆఖరి క్వార్టర్స్‌లో భారత్ మరింత దూకుడుగా ఆడింది. 55వ నిమిషంలో దిల్‌ప్రీత్ అద్భుత రీతిలో ఫీల్డ్ గోల్ చేయడంతో 3-1తో ఆధిక్యంలో దూసుకెళ్లింది.

ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో నాలుగోసారి
ఇలా.. డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో నాలుగోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్‌తో శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 3-2తో గెలిచింది. భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (19వ ని.లో), చింగ్లేన్‌సనా (44వ ని.లో), దిల్‌ప్రీత్‌సింగ్ (55వ ని.లో).... జపాన్ తరఫున వకురి (22వ ని.లో), జెన్‌దాన (56వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.

ఆసియా క్రీడల్లో కాంస్యతోనే అసంతృప్తితో..
చివరి నిమిషాల్లో జపాన్ ఒక గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 3-2కి తగ్గింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో భారత్, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకుంటాయి. గతంలో భారత్ 2011, 2016లలో ఫైనల్లో పాక్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. ఆసియా క్రీడల్లో కేవలం కాంస్య పతకంతోనే సరిపెట్టుకుని అసంతృప్తితో ఉన్న భారత్ సెమీస్‌లో జపాన్‌పై పైచేయి సాధించేందుకు తీవ్రంగా కృషి చేసింది.

ఎలాంటి ఒత్తిడి లేకుండా సహజమైన ఆటతీరుతోనే
భారత హాకీ జట్టు కోచ్ హరేంద్ర సింగ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ శనివారం జపాన్‌తో తమ జట్టు తలపడే మ్యాచ్ పూర్తిగా కొత్త అనుభూతులను పంచుతుందనే నమ్మకం ఉందని అన్నాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సహజమైన ఆటతీరుతోనే ప్రత్యర్థిపై పైచేయి సాధించే దిశగా పోరాడాలని తమ జట్టు ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసినట్టు తెలిపాడు.


Click it and Unblock the Notifications
