Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్‌పై విన్: హాకీలో భారత్‌కు స్వర్ణం, ఒలింపిక్స్‌కు అర్హత

ఇంచియాన్: దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆసియా క్రీడల హాకీలో భారత్ స్వర్ణం సాధించింది. 16 ఏళ్ల తర్వాత భారత్ పురుషుల జట్టు ఈ విజయాన్ని సాధించింది. షూటవుట్‌లో భారత్ 4-2 తేడాతో పాకిస్తాన్ పైన గెలుపొందింది. ఈ విజయంతో భారత్ 2016లో రియోలో జరగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. భారత్ ఎనిమిదో బంగారు పతకం సాదించింది.

కాగా, గురువారం భారత్ మరో రెండు స్వర్ణాలను గెలుచుకుంది. హాకీలో స్వర్ణం గెలవడంతో పాటు, అథ్లెటిక్స్ మహిళలు 4X400 మీటర్ల ఈవెంట్‌లోను భారత్ స్వర్ణం సాధించింది. దీంతో ఇప్పటి వరకు భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య తొమ్మిదికి చేరింది.

Asian Games: India win hockey gold, beat Pakistan 4-2 in penalty shootout

ఆసియా క్రీడల్లో భాగంగా బాక్సింగ్‌లో భారత్ కాంస్యం సాధించింది. బాక్సర్ సతీష్ కుమార్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా, మరో రెండు పతకాలను కూడా భారత్ ఖరారు చేసుకుంది. కబడ్డీ విభాగంలో భారత్ రెండు పతకాలు ఖాయం చేసుకుంది. భారత మహిళలు, పురుషుల జట్లు ఫైనల్‌కు చేరాయి. అయితే, తైక్వాండోలో మాత్రం భారత్ ఉత్తిచేతులతో తిరుగు ముఖం పట్టింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:16 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+