చైనాలోని హాంగ్‌జో వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు చెలరేగింది. పూల్-ఏ ప్రిలిమనరీ రౌండ్‌లో ఉజ్బెకిస్తాన్‌ను భారత జట్టు ఎదుర్కొంది. ఈ మ్యాచులో ఏకంగా ముగ్గురు భారత ఆటగాళ్లు హ్యాట్రిక్స్ సాధించారు. దీంతో భారత్ ఏకంగా 16-0 తేడాతో ఉజ్బెకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. భారత జట్టులో లలిత్ ఉపాధ్యాయ్, వరుణ్ కుమార్ చెరో నాలుగు గోల్స్ వేయడం గమనార్హం.
భారత స్టార్ మన్‌దీప్ సింగ్ కూడా మూడు గోల్స్‌తో సత్తా చాటాడు. వీరితోపాటు అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సంజయ్ కూడా గోల్స్ చేశారు. ఈ విజయంతో ముందడుగు వేసిన భారత్.. మంగళవారం నాడు సింగపూర్‌తో తలపడుతుంది. ఇక మిగతా క్రీడల విషయానికొస్తే.. భారత మహిళా షూటర్ రమిత వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్యం సాధించింది.

ఈ ఆసియా గేమ్స్‌లో రెండు వేర్వేరు పోటీల్లో మెడల్స్ సాధించిన తొలి ప్లేయర్‌గా ఆమె రికార్డు సాధించింది. మహిళల టీం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్స్‌లో మెహూలీ, ఆషీతో కలిసి రమిత రజతం గెలిచిన సంగతి తెలిసిందే. 19 ఏళ్ల రమిత ఇలా రెండు విభాగాల్లో పతకాలు సాధించడంపై భారత క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆమె మరింతగా రాణించి దేశ ప్రతిష్టను పెంచుతుందని అంటున్నారు.

అలాగే మహిళల 4x400 రిలే స్విమ్మింగ్‌లో భారత అమ్మాయిలు సత్తా చాటారు. ధీనిధి దేశింఘూ, మానా పటేల్, జాన్వీ చౌదరి, శివంగి శర్మతో కూడిన బృందం 3 నిమిషాల 53.80 సెకన్లలో ఈ రిలే పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ఈ బృందం ఫైనల్‌కు అర్హత సాధించింది.
అదే సమయంలో స్విమ్మర్లు తనీష్ మాథ్యూ, ఆనంద్ శైలజ ఇద్దరూ కూడా 100 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. థాయ్‌ల్యాండ్ చేతిలో ఓడిన భారత మహిళల టేబుల్ టెన్నిస్ బృందం కూడా ఆసియా గేమ్స్ నుంచి తప్పుకుంది. థాయ్‌ల్యాండ్ చేతిలో 3-2 తేడాతో ఓడిన భారత మహిళల జట్టు రౌండ్ ఆఫ్ 16 గేమ్‌లోనే ఆసియా క్రీడల నుంచి తప్పుకోవడం గమనార్హం.