For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Asian Games 2023: అమ్మాయిలూ అదరగొట్టారు..సింగపూర్‌ను చిత్తు చేసిన మహిళల హాకీ టీం!

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. 22 ఏళ్ల భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా వరల్డ్ రికార్డు నమోదు చేసింది. 469.6 స్కోర్‌తో టాప్‌లో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన క్రీడల్లో భారత పురుషుల స్కీట్ బృందం కాంస్యం సాధించారు. గుర్జోత్ ఖంగూర, అంగద్ వీర్ సింగ్ బజ్వా, అనంత్ జీత్ సింగ్‌తో కూడిన బృందం కాంస్యం నెగ్గింది.

అలాగే 24 ఏళ్ల భారత సెయిలర్ విష్ణు శరవణన్ కూడా పతకంతో మెరిశాడు. పురుషుల డింగీ విభాగంలో తలపడిన అతను కాంస్యంతో ఆకట్టుకున్నాడు. ఇది సెయిలింగ్‌లో భారత్ సాధించిన మూడో పతకం కావడం గమనార్హం. షూటింగ్‌లో 18 ఏళ్ల ఇషా సింగ్ చెలరేగింది. టీం ఈవెంట్‌లో కూడా స్వర్ణ పతకంతో మెరిసిన ఆమె.. 25 మీటర్ల మహిళల ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించింది.

Asian Games 2023 Indian Womens Hockey Team destroyes Singapore

పురుషుల స్కీట్ ఈవెంట్‌లో 24 ఏళ్ల షూటర్ అనంత్ జీత్ సింగ్ నారుక సిల్వర్ పతకంతో మెరిశాడు. ఈ ఈవెంట్‌లో 58/60 పాయింట్లు సాధించిన అతను రెండో స్థానంలో నిలిచాడు. ఈ పోటీల కువైట్‌కు చెందిన 60 ఏళ్ల అబ్దుల్లా అల్ రషీదీ స్వర్ణం సాధించాడు. ఇక భారత మహిళల హాకీ జట్టు తమ ఓపెనింగ్ మ్యాచ్‌లో చెలరేగింది. సింగపూర్‌ను ఏకంగా 13-0తో ఓడించింది.

భారత అమ్మాయిల్లో 10 మంది గోల్స్ చేయడం గమనార్హం. పురుషుల టెన్నిస్‌లో భారత నెంబర్ వన్ ప్లేయర్ అయిన సుమిత్ నగాల్‌కు అదృష్టం కలిసి రాలేదు. పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ చేరిన అతను తడబడ్డాడు. చైనాకు చెందిన ఝాంగ్ జిజెన్‌ చేతిలో ఓడిన అతను వెనుతిరిగాడు. అలాగే ఆరుసార్లు ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన బాక్సర్ శివ థాపా ఏకంగా 5-0 తేడాతో ఓడి ఇంటిమొఖం పట్టాడు.

టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సాథియాన్ జ్ఞానశేఖరన్, మనికా బాత్రా జోడీ ముందడుగు వేసింది. థాయ్‌ల్యాండ్ జోడీపై విజయంతో రౌండ్-16లో అడుగు పెట్టిందీ జంట. ఈ-స్పోర్ట్స్‌ విభాగంలో భారత బృందం ఐదో స్థానంలో నిలిచింది. ఇక భారత వుషూ ప్లేయర్ నారెమ్ రోషిబినా దేవి ఫైనల్ చేరింది. 2018లో కాంస్యం సాధించిన ఆమె.. ఈసారి స్వర్ణం కోసం పోటీ పడనుంది.

వరుసగా టెన్నిస్ ప్లేయర్లు ఇంటి దారి పడుతున్న సమయంలో డబుల్స్ ప్లేయర్లు రామ్‌కుమార్ రామనాథన్, సాకేత్ మైనేనీ జోడీ సెమీఫైనల్ చేరింది. దీంతో టెన్నిస్‌లో కూడా భారత్‌కు ఒక పతకం ఖాయమైనట్లే. ఇక ఆసియా గేమ్స్‌లో ఇప్పటి వరకు పాకిస్తాన్ చేతిలో ఓడని భారత పురుషుల స్క్వాష్ బృందం ఈసారి ఓటమిపాలైంది. పూల్-ఏలో భాగంగా జరిగిన ఈ మ్యాచులో పాక్ చేతిలో 2-1 తేడాతో భారత్ ఓడింది.

Story first published: Wednesday, September 27, 2023, 21:38 [IST]
Other articles published on Sep 27, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+